మన యూనివర్సిటీల్లో AI కోర్సులు - ఫుల్ డిమాండ్, సీట్ల పెంపు..!!
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఏ రంగంలో చూసిన ఏఐ ప్రభా వం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ కారణంగా పలు దిగ్గజ టెక్ కంపెనీల్లోనూ భారీగా లే ఆఫ్స్ కొన సాగు తున్నాయి. ఇదే సమయంలో ఏఐ లో నైపుణ్యం ఉన్న వారికి మాత్రం ప్రాధాన్యత పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏఐ కి ఆదరణ కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐ వినియోగం పైన ఫోకస్ చేసాయి. దీంతో, తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల పరధిలో ఏఐ కోర్సులకు సీట్లు పెంచుతున్నారు. డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
డిమాండ్ కోర్సులు
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. పలు ప్రముఖ సంస్థలు సైతం ఏఐ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఫలితంగా ఏఐ నైపుణ్యం ఉన్న వారికి మంచి వేతనాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. ఏఐ చేయాలంటే ఏదైనా ఇంజినీరింగ్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ (బీఈ, బీటెక్) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ) కోర్సుల్లో ఆ విభాగం ఉండాలి. ప్రస్తుత కాలంలో ఏఐ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా పలు యూనివర్సిటీలు సీట్లు పెంచుతున్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూతో పాటు పలు విశ్వవిద్యాలయాల అనుబంధ కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో బీఈ, బీటెక్ చదవాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఏఐ - ఎంఎల్ కోర్సులకు
ఏపీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది సైబర్ సెక్యూరిటీ, డాటా సెన్స్, ఏఐ-మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) కోర్సులను ప్రవేశ పెట్టింది. ఆంధ్ర వర్సిటీలో వీఎల్‌ఎస్‌ఐ, క్వాంటం కంప్యూటింగ్ కొత్తగా ప్రారంభించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏఐ-ఎంఎల్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకాశం జిల్లా మద్దిపాడులోని ఈడుగుండ్లపాడులో శ్రీహర్షిణి, కృష్ణా జిల్లా గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది.
పెరుగుతున్న సీట్లు
ఏఎన్‌యూ పరిధిలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్... ఏయూ పరిధిలో వీఎల్‌ఎ్‌సఐ, క్వాంటం కంప్యూటింగ్... కృష్ణా వర్సిటీ పరిధిలో ఏఐ అండ్ ఎంఎల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో బ్రాంచ్‌లో 60 చొప్పున సీట్లు కేటాయించారు. కొత్తగా ప్రకాశం జిల్లాలో, గుడివాడలో కలిపి రెండు కళాశాలలకు అనుమతులు వచ్చాయి. ప్రభుత్వం ఏఐ ఆధారిత కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో, రెండు రాష్ట్రాల్లోనూ ఈ కోర్సుల డిమాండ్ కు అనుగుణంగా సీట్లను పెంచుతూ నిర్ణయించారు.












Click it and Unblock the Notifications