AI ముప్పు నుంచి ఈ అయిదు కేటగిరీల జాబ్స్ సేఫ్..!!
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఏఐ ఇప్పుడు దిగ్గజ సంస్థల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తోంది. వరుసగా ప్రముఖ కంపెనీలు ఉద్యోగుల ఊచకోత కొనసాగిస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఏఐ నైపుణ్యం ఉన్న వారికే భవిష్యత్ అన్నట్లుగా తాజా పరిస్థితులు మారుతున్నాయి. హై క్వాలిటీ టాలెంట్ ఉన్న వారికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి.అయితే, ఏఐ ఎంతగా విస్తరించినా అయిదు కేటగిరీల్లోని ఐటీ జాబ్స్ కు మాత్రం ఢోకా లేదని నిపుణులు చెబుతున్నారు.
దిగ్గజ ఐటీ కంపెనీలు వరుసగా ఉద్యోగులను తెలిగిస్తున్నాయి. దీంతో, ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కారణంగానే ఎక్కువ మొత్తంలో ఉద్యోగాల పైన వేటు పడుతోంది. ఏఐ ఇంతగా ఐటీ రంగ ఉద్యోగులను కలవరపాటుకు గురి చేస్తున్నా.. అయిదు కేటగిరీ ల్లో పని చేస్తున్న వారికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

అందులో తొలి సైబ్ సెక్యూరిటీ ఇంజనీర్స్. ఈ విభాగంలో ఏఐ పని తీరు పైన అంచనాలు ఉన్నా.. సవాళ్ల పరిష్కారంలో మాత్రం మానవవనరుల అనుభవం కీలకమని గుర్తించారు. అదే విధంగా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్స్ , ఈ విభాగానికి చెందిన ఉద్యోగులు సైతం సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇంటర్నెట్ అఫ్ థింగ్స్(ఐఓటి), ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్లకు ఉన్న డిమాండ్ ఈ నమ్మకానికి కారణంగా కనిపిస్తోంది.
ఈ విభాగంలో మానవ వనరులు తప్పని సరి. పూర్తిగా ఏఐ పైనే అధారపడే పరిస్థితి లేదు. అదే విధంగా రోబోటిక్ ఇంజనీర్లకు నిపుణులు భరోసా ఇస్తున్నారు. రాబోయే దశాబ్ద కాలం వీరికి మంచి డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. వీరు ఏఐ గురించి ఎలాంటి ఆందోళనతో ఉండాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు. ప్రస్తుతం క్వాంటం కంప్యూటింగ్ పైన ఆసక్తి కనిపిస్తోంది. దీంతో, ఈ రంగంలో నిపుణులు కీలకంగా మారనున్నారు.
ఇక్కడ కావాల్సిన సృజనాత్మకత, ఆవిష్కరణ లను ఏఐ ఆశించిన స్థాయిలో భర్తీ చేయలేదనే అభిప్రాయం ఉంది. ఇక, డెవలప్ మెంట్ ఆపరేషన్ ఇంజనీర్స్ కు కూడా ఏఐ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉండవనే అంచనా లు వ్యక్తం అవుతున్నాయి. ఇతర ఐటి ఉద్యోగులు ఏఐ కారణంగా భయపడుతున్నా కూడా సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, డెవలప్ మెంట్ ఆపరేషన్స్, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్ ఇంజనీర్స్ మాత్రం ఢోకా ఉండదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications