Google: ఏఐ ముప్పు వేళ ఉద్యోగులకు గూగుల్ బంపర్ ఆఫర్..!
గూగుల్ తన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆఫీసు్లో కృత్రిమ మేధస్సును ఎలా ఉపయోగించాలనే దానిపై ఒక కీలక అడుగు వేసింది. ఉద్యోగులు ఉత్పాదకతను పెంచడానికి ఏఐ సాధనాలను ఎలా వాడాలన్న దానిపై వివరణాత్మక మార్గదర్శకాలను మెయిల్ చేసింది.
కృత్రిమ మేథ (ఏఐ) దూకుడు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్ని తొలగించేందుకు కంపెనీలకు ఓ పెద్ద అస్త్రం దొరికినట్లయింది. ఏఐ వాడకంతో ఉద్యోగుల సంఖ్యను ఎలా తగ్గించుకోవాలన్న దానిపై కంపెనీలు పోటీ పడి మరీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంత ఖర్చుపెట్టి అయినా ఏఐ సాఫ్ట్ వేర్ లను కొనుగోలు చేసి వాటిని ఉద్యోగుల స్ధానంలో భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీ కూడా ఏఐ వాడకం మొదలుపెట్టి ఉద్యోగుల్ని తొలగిస్తోంది.
ఇలాంటి సమయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ (google) తన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆఫీసు్లో కృత్రిమ మేధస్సును ఎలా ఉపయోగించాలనే దానిపై ఒక కీలక అడుగు వేసింది. ఉద్యోగులు ఉత్పాదకతను పెంచడానికి ఏఐ (AI) సాధనాలను ఎలా వాడాలన్న దానిపై వివరణాత్మక మార్గదర్శకాలను మెయిల్ చేసింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) తాజాగా కంపెనీలో రాసిన కోడ్‌లో 30 శాతం ఏఐ ద్వారా సృష్టించినట్లు ఇందులో తెలిపారు. ఈ నేపథ్యంలో కంపెనీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొన్ని నెలల క్రితం గూగుల్ ఏఐ ద్వారా రాసే కోడింగ్ 25 శాతంగా ఉంది. గత నెలలో ఏఐ సాధనాలు తమ ఇంజనీర్లకు 10 శాతం ఎక్కువ ఉత్పాదకతను అందించాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన మెయిల్ లో పేర్కొన్నారు. ఈ మెయిల్ లో ఇంకా రోజువారీ కోడింగ్‌లో ఏఏఐని వాడేందుకు ఉత్తమ పద్ధతులను ఈ మార్గదర్శకాల్లో వివరించారు. గూగుల్‌లోని ఇంజనీర్లు సృష్టించిన ఈ ప్లేబుక్ లో కంపెనీలో బాగా పనిచేసిన వారి వివరాలు ఉంచుతున్నారు.

ప్రతి ఇంజనీర్ ఏఏఐని ఉపయోగించి వేగంగా ఉత్పత్తి చేయాలని, మరింత మెరుగ్గా చేయాలని తాము కోరుకుంటున్నామని గూగుల్ చెబుతోంది. గూగుల్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల బృందం తయారు చేసిన ఈ సిఫార్సులు, ఉత్తమ పద్ధతులు కంపెనీలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వారి రోజువారీ పనిలో ఏఐ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఉపయోగపడతాయని తెలిపింది. గూగుల్ ఇప్పటివరకూ గూస్ వంటి పాత సాంకేతిక సాధనాలనే వాడుతోంది. అయితే తాజాగా గూగుల్ జెమిని కోడ్ అసిస్ట్, జెమిని సీఎల్ఐ, ఆండ్రాయిడ్ స్టూడియోలో జెమిని వంటి సాధనాలను విడుదల చేసింది. వీటిని ప్రతి ఒక్కరూ వాడాలని కోరుతోంది.
-
2030 నాటికి ఏఐ దెబ్బకి ఆ సెక్టార్లో ఉద్యోగాలు ఖాళీ..? -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications