Layoffs బాట పట్టిన మరో టెక్ దిగ్గజం..!!

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం.. హావ్లెట్ ప్యాకర్డ్ (HP) లేఆఫ్స్ బాట పట్టింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్యను కుదించనుంది. దాదాపుగా 6,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్క్‌ఫ్లోకు మారే క్రమంలో సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించే దిశగా అడుగులు వేస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సంస్థ కార్యకలాపాల్లోకి విస్తరించిన తాజా టెక్ కంపెనీగా హెచ్‌పీ. సంస్థ పనితీరును మరింత మెరుగుపర్చడం కార్యకలాపాలను సరళీకృతం చేయడం, ప్రొడక్ట్ బేస్డ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి AI సేవలను వినియోగించుకుంటోంది. కస్టమర్ సపోర్ట్‌ను మెరుగుపరచడంతో పాటు మొత్తం ఉత్పాదకతను పెంచడానికి AI టూల్స్ ను విస్తారంగా ఉపయోగిస్తోంది. దీనిపై భారీగా పెట్టుబడులు సైతం పెట్టబోతోంది.

HP Strategic Layoffs Set to Boost AI and Operational Efficiency

2028 నాటికి సంస్థ కార్యకలాపాల్లో మెజారిటీ వాటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దే కానుంది. ఈ నేపథ్యంలో- లేఆఫ్స్ కు వెళ్లాలని నిర్ణయించింది. ప్రొడక్ట్ అండ్ డెవలప్మెంట్, అంతర్గత కార్యకలాపాలు, కస్టమర్ సపోర్ట్ విభాగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. రాబోయే మూడేళ్ళలో ఈ పునర్నిర్మాణం ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్ల స్థూల ఆదాయం ఆదా అవుతుందని హెచ్‌పీ వెల్లడించింది.

గత ఫిబ్రవరిలో జరిగిన పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా హెచ్‌పీ ఇప్పటికే 1,000 నుండి 2,000 మంది ఉద్యోగులను తొలగించింది కూడా. ప్రస్తుతం AI- ఆధారిత చిప్‌తో కూడిన పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. అక్టోబర్ 31వ తేదీ నాటికి ముగిసిన నాలుగో త్రైమాసికంలో హెచ్‌పీ విక్రయించిన పర్సనల్ కంప్యూటర్లల్లో 30 శాతానికి పైగా AI చిప్‌లతో కూడిన పరికరాలు ఉన్నాయి. దీంతో ఇకపై పూర్తిస్థాయిలో ఇటువంటి పీసీల తయారీకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.

డేటా సెంటర్ల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా మెమరీ చిప్‌ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇది హెచ్‌పీ, డెల్, ఏసర్ వంటి పీసీ తయారీదారుల ఖర్చులను పెంచుతోంది. లాభాల మార్జిన్‌పై ఒత్తిడి తీసుకువస్తుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. బిగ్ టెక్ కంపెనీలు AI సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పోటీ పడుతున్నందున డైనమిక్ రాండమ్-యాక్సెస్ మెమరీ (DRAM), NAND వంటి కీలక మెమరీ చిప్‌ల ధరలు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2026 రెండవ సగంలో దీని ఆర్థిక ప్రభావం ఉంటుందని హెచ్‌పీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+