టెన్త్, ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఆన్ లైన్ లో ఫ్రీగా AI కోర్సులు.. ఇలా చేయండి
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలోనే దేశంలోని విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్ వినూత్నంగా ఆలోచించింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు టెక్నాలజీ, సామాజిక శాస్త్రాలను పరిచయం చేసేందుకు 8 వారాలపాటు ఆన్ లైన్ ద్వారా కోర్సులను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దేశంలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు చిన్నతనం నుంచే టెక్నాలజీ, సామాజిక శాస్త్రాలపై అవగాహన కల్పించేందుకు స్కూల్ కనెక్ట్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది ఐఐటీ మద్రాస్. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 2,300కు పైగా స్కూల్స్ అనుసంధానం అయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచి 61 పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 250 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ లోపు ఆసక్తి ఉన్న టెన్త్, ఇంటర్ విద్యార్థులు తమ విద్యా సంస్థల ద్వారానే పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులకు 8 వారాలపాటు ఆన్ లైన్ లో డేటా సైన్స్ అండ్ ఏఐ, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ , గేమ్స్ అండ్ పజిల్స్ , పర్యావరణం, హ్యుమానిటీస్ తదితర కోర్సులు నేర్పిస్తారు. ఈ కోర్సులతో రికార్డు చేసిన వీడియోలను ప్రతి సోమవారం పోర్టల్ లో అందుబాటులో ఉంచుతారు. ఐఐటీ ప్రొఫెసర్ల తో ప్రతి శనివారం లైవ్ లో కూడా మాట్లాడొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే అడగొచ్చు.












Click it and Unblock the Notifications