ఏఐ వాడుకొని 4వేల కోట్లు ఆదా చేసిన ప్రముఖ టెక్ కంపెనీ !
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన టెక్ దిగ్గజ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి. ఇప్పుడు ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించి సంచలనాలు సృష్టిస్తోంది. సంస్థ గత ఏడాదిలో ఏఐ టెక్నాలజీ వినియోగం ద్వారా 500 మిలియన్ డాలర్లు.. ఆదా చేసిందని మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ ఆల్తోఫ్ ప్రకటించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4,285 కోట్లు విలువ ఉంటుంది. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా కాల్ సెంటర్ కార్యకలాపాల్లో ఏఐని వాడటం వల్ల ఖర్చు తగ్గిందని వివరించారు. అంతే కాకుండా కస్టమర్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. కానీ మరోవైపు అదే సమయంలో 9,100 మందిని ఉద్యోగాలను తొలగించడంపట్ల తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4 శాతంగా చెబుతున్నారు.

ఎక్స్‌బాక్స్, గేమింగ్ డివిజన్‌లకు చెందిన ఉద్యోగులపై ఈ లేఆఫ్‌ల ప్రభావం ఎక్కువగా పడిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల కోత విధించడం ఇది నాలుగోసారి కావడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications