అద్దిరిపోయే శుభవార్త చెప్పిన Microsoft

మైక్రోసాఫ్ట్ లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. సంస్థ పునర్వ్యవస్థీకరణ ముమ్మరం అయింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను మళ్లిస్తోంది. మ్యాన్ పవర్ కంటే కూడా AI ని గట్టిగా నమ్ముకుందా సంస్థ. ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ ను మరింత కఠినతరం చేసింది. 'రిటర్న్ టు ఆఫీస్' (RTO) పాలసీని మరంత టైట్ చేసింది. ఇందులో భాగంగా టఫ్ అటెండెన్స్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ పరిస్థితుల మధ్య మైక్రోసాఫ్ట్ మరో ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. రిక్రూట్మెంట్లకు తెర తీసింది. దీనికోసం త్వరలో డ్రైవ్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. భారీ లేఆఫ్స్ తర్వాత ఇక కొత్త నియామకాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై అనుభవం, గట్టి పట్టు ఉన్న టెక్కీలను నియమించుకోవడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. AI-బేస్డ్ నియామకాల ప్రక్రియ త్వరలో మొదలవుతుందని సత్య నాదెళ్ల చెప్పారు.

Microsoft s Satya Nadella Introduces AI-Driven Hiring Strategy for Future Growth

బీజీ2 పాడ్‌కాస్ట్‌లో ఇన్వెస్టర్ బ్రాడ్ గెర్ట్‌నర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పునర్యవస్థీకరణలో భాగంగా మైక్రోసాఫ్ట్ లో సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించామని గుర్తు చేశారు. 2025 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,28,000లకు కుదించినట్లు వివరించారు. 2022లో కంపెనీ నియామకాలను 22 శాతం పెంచామని, AI ఇన్ ఫ్రా, పార్ట్నర్ షిప్ ప్రోగ్రామ్, ప్రొడక్ట్ టూల్స్ లో మరింత పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగుల సంఖ్యను కుదించుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఇప్పుడు మళ్లీ కొత్త టెక్కీలకు అవకాశం ఇవ్వదలిచామని సత్య నాదెళ్ల చెప్పారు. గతంలో కంటే మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటామని, AI అనుభవం, గట్టిపట్టు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. ఉద్యోగులు తమ పనిలో దాదాపు ప్రతి విషయంలోనూ AIని ఉపయోగించుకోవాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ లో ఎటువంటి ప్లానింగ్ గానీ, దాని ఇంప్లిమెంటేషన్ గానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోనే ప్రారంభమౌతుందని స్పష్టం చేశారు. ప్రతిదీ ఏఐ నుంచే నుంచే మొదలవుతుందని అన్నారు.

మైక్రోసాఫ్ట్ 365 కొపైలట్ (Copilot), గిట్‌హబ్ కొపైలట్ (GitHub Copilot) వంటి ఉత్పత్తులలోని AI సామర్థ్యాలను ప్రతి ఉద్యోగి ఉపయోగించుకోవాలని కంపెనీ కోరుకుంటోంది. ఈ ఉత్పత్తులు ఓపెన్‌ఏఐ (OpenAI), ఆంథ్రోపిక్ (Anthropic) వంటి సంస్థల మోడల్స్‌ను అనుసంధానిస్తాయి. క్లౌడ్ డేటా కేంద్రాలకు డిమాండ్ పెరిగినప్పుడు, ఓ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ మెయింటెనెన్స్ పనులను నిర్వహించడానికి AI ఏజెంట్‌లను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సత్య నాదెళ్ల అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+