ఏఐతో అంధులకు చూపు.. ఆ యువకుడి అద్భుత సృష్టికి ప్రపంచం ఫిదా..!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ట్రెండ్ నడుస్తోంది. అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకొస్తోంది. మానవులకు అనితర సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది. ఈ క్రమంలో ఏఐను కొంతమంది దేశ సేవకు, మంచి పనులకు వినియోగించుకుంటున్నారు. మరికొందరు సైబర్ అటాక్స్ వంటి వాటికి ఈ ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడి ఏఐ టెక్నాలజీతో అద్భుతం చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరీ అనే పల్లెటూరు నుంచి వచ్చిన మునీర్ ఖాన్ ఏఐ టెక్నాలజీ సాయంతో అంధులకు చూపు తెప్పించగలిగాడు. ఏఐ సాంకేతికతను పూర్తిగా అధ్యయనం చేసి ఈ సాంకేతికత సాయంతో అంధులకు విజ్యూవల్లీ ఇంపెరేడ్ గ్లాసెస్ ను తయారు చేశాడు. ఆయన సాధించిన ఘనతకు గ్లోబల్ అవార్డు దక్కింది.
మునీర్ ఖాన్ నైనితల్ లోని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ నుంచి ఇంజినీరింగ్ పట్టా సాధించాడు. అనంతరం ఏఐ టెక్నాలజీపై జరిగిన అనేక వర్క్ షాప్స్ కు హాజరై సాంకేతికతపై పట్టు సాధించాడు. దేశంలోని వివిధ ఐఐటీల్లో ఏఐ షార్ట్ టర్మ్ కోర్సులు నేర్చుకున్నాడు. అలా సాంకేతికతపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు.
ఆ తర్వాత విజన్ ప్రో అనే ప్రాజెక్ట్ కు పునాది వేశాడు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఏంటంటే.. ఏఐ సాంకేతికతను వినియోగించి అంధులకు స్మార్ట్ గ్లాసెస్ రూపొందించడం. ఈ గ్లాసెస్ లో ఆబ్జెక్ట్ రికగ్నిషన్ వ్యవస్థను అమర్చాడు. దీని సాయంతో అంధులు ఈ గ్లాసులు ధరిస్తే టెక్స్ట్ టూ స్పీచ్ ఫంక్షన్ ఆధారంగా పుస్తకాల్లోని విషయాన్ని బిగ్గరగా చదువుతుంది. దీని ద్వారా అంధులు సులభంగా ఆకలింపు చేసుకోవచ్చు.

అంతేకాక ఏఐ సాయంతో చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ కు ట్రాఫిక్ లైట్స్ రీడింగ్.. వాయిస్ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది అంధులకు ఓ గేమ్ ఛేంజర్ గా మునీర్ ఖాన్ తెలిపాడు. మునీర్ కృషిని గుర్తించిన ప్రఖ్యాత న్యూయార్క్ సంస్థ.. హ్యూమానిటీ రంగంలో ఇచ్చే ప్రఖ్యాత అవార్డును అందజేసింది.












Click it and Unblock the Notifications