'అడల్ట్ మోడ్' తీసుకొస్తున్న చాట్ జీపీటీ.. కండిషన్స్ అప్లై ?
ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ఏఐ.. తమ చాట్‌జీపీటీకి మరో కీలక ఫీచర్‌ను పరిచయం చేయనుంది. 'అడల్ట్ మోడ్' పేరుతో ఈ కొత్త సదుపాయం తీసుకొస్తుంది. కేవలం పెద్దలను మాత్రం టార్గెట్ చేస్తూ 2026 మొదటి త్రైమాసికంలో ఇది అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో, జీపీటీ-5.2 మోడల్‌పై జరిగిన సమావేశంలో దీనిపై ప్రకటన చేశారు. 'అడల్ట్ మోడ్' కేవలం వయస్సు నిర్ధారించబడిన వయోజనులకు మాత్రమే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మైనర్లు దీనిని వినియోగించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని.. కొన్ని దేశాల్లో వయస్సు ధృవీకరణ ప్రక్రియను ఇప్పటికే పరీక్షిస్తున్నట్లు వివరించారు.

కాగా ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా నిలిపివేయబడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు వయసు ధ్రువీకరణ పూర్తి చేసుకున్న తర్వాతే 'అడల్ట్ మోడ్' కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరని క్లారిటీ ఇచ్చారు. ఈ మోడ్‌కు నిర్దిష్ట పరిమితులు ఉంటాయని సంస్థ తెలిపింది.
దీనిపై ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. సున్నితమైన కంటెంట్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications