భారత్‌లో "Open AI" ఆఫీస్.. ఎప్పుడు ? ఎక్కడంటే ??
న్యూఢిల్లీలో ఓపెన్‌ఏఐ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఎక్స్ ( ట్విట్టర్)లో ప్రకటించారు. భారతదేశంలో చాట్‌జీపీటీ వినియోగదారులు నాలుగు రెట్లు పెరగడాన్ని ఆయన "అద్భుతం" అని పేర్కొన్నారు. రాయిటర్స్ ప్రకారం, వినియోగదారుల సంఖ్యలో భారతదేశం ఓపెన్‌ఏఐకి రెండవ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.
భారతదేశంలో ఓపెన్‌ఏఐ వ్యూహం..
ఓపెన్‌ఏఐ తన మొదటి స్థానిక బృందాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, $4.60 నెలవారీ ప్లాన్‌ను ప్రారంభించి, దాదాపు ఒక బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. "భారతదేశంలో AI పట్ల ఉన్న ఉత్సాహం మరియు అవకాశాలు చాలా గొప్పవి. ఇక్కడ అద్భుతమైన టెక్ నిపుణులు, ప్రపంచ స్థాయి డెవలపర్లు మరియు ప్రభుత్వ మద్దతు ఉండటంతో, భారత్ ప్రపంచ AI నాయకుడిగా మారేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి," అని ఆల్ట్‌మన్ తెలిపారు.

ఈ ప్రకటనపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. "భారతదేశంలో ఓపెన్‌ఏఐ ఉనికిని స్థాపించడం డిజిటల్ ఆవిష్కరణ.. AI స్వీకరణలో పెరుగుతున్న నాయకత్వాన్ని సూచిస్తుందన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI ప్రతిభ, ఎంటర్‌ప్రైజ్-స్థాయి పరిష్కారాలతో, AI-ఆధారిత తదుపరి తరంగాన్ని నడిపించడంలో భారత్ ప్రత్యేకంగా నిలబడుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
పోటీ & భవిష్యత్ ప్రయోజనాలు
ప్రస్తుతం ఓపెన్‌ఏఐకి గూగుల్ జెమిని, పెర్‌ప్లెక్సిటీ వంటి సంస్థల నుంచి బలమైన పోటీ ఎదురవుతోంది. ఈ సంస్థలు కూడా తమ ఉచిత సర్వీసులతో మార్కెట్‌లో తమ స్థానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఓపెన్‌ఏఐ భారతదేశంలో కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల స్థానిక టెక్ నిపుణులు, డెవలపర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో AI పరిశోధన, పరిష్కారాల అభివృద్ధికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థులు, చిన్న& మధ్య తరహా వ్యాపారాలు (SMEs), స్టార్టప్‌లు తక్కువ ఖర్చుతో అధునాతన AI టూల్స్ ఉపయోగించుకోగలుగుతారు.












Click it and Unblock the Notifications