రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - తక్కువ ధరకే ఇక, పంపిణీ ముహూర్తం..!!
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత రేషన్ సరఫరా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చింది. రేషన్ కార్డుల విధానంలోనూ సంస్కరణలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం పెరుగుతున్న ధరల వేళ సామాన్య ప్రజల పైన భారం పడకుండా కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలు ఎక్కువగా వినియోగించే స్టీమ్ రైస్‌ను చౌకధరల దుకాణాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ప్రతి నెల సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల స్టీమ్ రైస్‌ను రేషన్ కార్డుదారులు, పాఠశాలలు, వసతి గృహాలకు పంపిణీ చేయనున్నారు. అక్కడి ఫలితాలను పరిశీలించి దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని డిసైడ్ అయ్యారు. కాగా, ఓపెన్ మార్కెట్ లో బియ్యం ధరలు భారీగా పెరగటంతో.. సామాన్యులకు రిలీఫ్ ఇచ్చేలా కొత్త విధానం అమలు చేయనుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలు ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు అందుబాటులో ఉండే వైరైటీలు.. ధరలను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అమ్మకాల ప్రారంభం ముహూర్తం ఖరారైంది.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో.. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకు బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం రాష్ట్ర సచివాలయంలో రైస్ మిల్లర్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయించేలా ప్రభుత్వానికి సహకరిస్తామని ఆయనకు మిల్లర్లు హామీ ఇచ్చారు. బీపీటీ, కేఎన్‌ఎమ్ స్టీమ్ రైస్ కేజీ రూ.52, ముడి బియ్యం కేజీ రూ.50 చొప్పున విక్రయించాలని ధరలను ఖరారు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, మరో 500 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications