వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లివేళ.. జగన్ , షర్మిలపై వైఎస్సార్ కోరిక ఇదేనన్న తెలంగాణా నేత!
షర్మిల కూతురు అంజలి రెడ్డి పెళ్లి సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ షర్మిల తన కుమార్తె పెళ్ళికి సంబంధించి శుభలేఖను మొదట వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచారు. ఆయన ఆశీర్వాదంతో తన బిడ్డ పెళ్లి జరుగుతుందని పేర్కొన్నారు. ఇక శుభలేఖలను అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులకు పంచిన షర్మిల, తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారని తెలుస్తుంది. అయితే దీంతో రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరిగింది.
అయితే దీన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని షర్మిల స్పష్టం చేశారు. కూతురి పెళ్లితో ముడి పెట్టి రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం తనకు లేదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో షర్మిల కూతురు అంజలి రెడ్డి పెళ్లి వేళ తెలంగాణ నాయకుడు వి ప్రకాశ్ ఒక సంచలన విషయం వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూతురు గురించి ఏమని కోరుకున్నారో ఆయన వెల్లడించారు.

ప్రకాశ్ మాటల్లో వైఎస్ జగన్ కూతురిని, షర్మిల కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆయన కోరిక అని చెప్పారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన వైఎస్ఆర్ ఎప్పుడూ కుటుంబ సామరస్యానికి, పిల్లల భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇచ్చేవారని, జగన్ కూతురు విషయంలో ఆయన చెప్పిన మాటలు కుటుంబంలోని అందరికీ గుర్తు ఉండే ఉంటాయని ఆయన అన్నారు.
ఆయన జగన్ కూతురు అని చెప్పాల్సిన చోట కొడుకు అని పొరబాటుగా అన్నారు. జగన్ కూతురిని షర్మిల కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని భావించిన వేళ భారతి పెళ్ళికి ఒప్పుకోలేదని, దాని కారణంగానే షర్మిల బయటకు వెళ్లిపోయారని తెలంగాణా నేత వీ ప్రకాష్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
షర్మిల కూతురు పెళ్లి సందర్భంగా ఈ విషయం మళ్లీ చర్చకు వచ్చింది. వైఎస్ఆర్ కుటుంబంలో పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో పాత కోరికలు, కుటుంబ విషయాలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ప్రకాశ్ చెప్పిన విషయం కుటుంబ సభ్యులు, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. పెళ్లి శుభకార్యం కాబట్టి అందరూ కలిసి ఉండాలనే సందేశం ఇందులో ఉందని చాలామంది భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
