అంతా రివర్స్ అయింది, ఇక నుంచి - జగన్ కీలక వ్యాఖ్యలు..!!
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ పార్టీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాల పైన దిశా నిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో తాజా రాజకీయ పరిణామాల పైన చర్చిస్తున్నారు. పార్టీ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటుందని హామీ ఇస్తూనే.. కీలక సూచనలు అందిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి.
మాజీ సీఎం జగన్ విశాఖ పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. మున్సిపల్ ఎన్నికల వేళ నేత లు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలను వివరించారు. గత ప్రభుత్వానికి, ఈ రెండున్నర ఏళ్ల వెన్ను పోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలన మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని వ్యాఖ్యానిం చారు. నాడు-నేడు (మనబడి) కార్యక్రమంతో గవర్నమెంటు బడులను పూర్తిగా మార్చేశామని.. ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెట్టామని గుర్తు చేసారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు పెంచామని... పథకంలో వైద్యం ఖర్చును రూ.25 లక్షల వరకు పెంచామని చెప్పారు. గ్రామ స్థాయి లో విలేజ్ క్లినిక్స్ వచ్చాయని వివరించారు. వ్యవసాయ రంగంలోనూ కనీవిని ఎరగని మార్పులు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఈ రోజు పరిస్థితి చూస్తే అంతా రివర్స్ అయిందని... అంతా అస్తవ్యస్తంగా మారిందని జగన్ వ్యాఖ్యానించారు.

పార్టీ నేతలకు దిశా నిర్దేశం
రూపాయికి చాక్లెట్ కూడా వస్తుందో... లేదో తెలియదు కానీ, 99 పైసలకే విశాఖలో భూములు ఇచ్చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రతి ఊరిలో మందుతో పాటు, గంజాయి దొరుకుతోందని... గుడి, బడి పక్కన ఇవన్నీ దొరుకుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం.. అదానీ డేటా సెంటర్ ఏర్పాటు ప్రక్రియ కు నాంది జరిగిందన్నారు. చివరకు ఎవరూ పట్టించుకోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు పరిష్కారంగా హీర మండలం నుంచి రూ.600 కోట్లతో తాగునీరు సరఫరా చేశామని చెప్పుకొచ్చారు. గీతం వర్సిటీ... 55 ఎకరాల భూమిని కబ్జా చేశారు. దాని విలువ కనీసం రూ.5 వేల కోట్లు. దాన్ని అడ్డగోలుగా నచ్చిన వారికి, లోకేష్ తోడల్లుడికి ఇచ్చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో గట్టిగా పని చేయాలని... పార్టీ మీకు పూర్తిగా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖలో తొలిసారిగా నీటి ఎద్దడి ఏర్పడిందని... పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉంటే మరో 75 టీఎంసీల నీరు స్టోర్ చేయొచ్చని.. కానీ, చంద్రబాబు దాని ఎత్తు తగ్గించారని చెప్పుకొచ్చారు.













Click it and Unblock the Notifications
