ఎల్ నినో.. ఇంకా స్ట్రాంగ్ అయింది: ఈ ఆరు నెలల్లో మృత్యు తాండవం

దేశంలో వర్షాల కాలం క్రమంగా ముగింపు దశకు చేరుకుంటోంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవన వర్షాలు ఇప్పుడు తిరోగమన దిశగా అడుగులు వేస్తోన్నాయి. వాయువ్య, పశ్చిమ భారత్ నుంచి ఈ నెల 20వ తేదీ తర్వాత రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. క్రమంగా పొడి వాతావరణం నెలకొంటోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల భారీ వర్షాలు పడుతున్నాయి.

పసిఫిక్ మహా సముద్రం గగనతలంపై ఎల్ నినో మరింత బలపడటానికి అనుకూల వాతావరణం నెలకొంది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతోన్నాయి. రాబోయే కాలంలో పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగనున్నాయి. ప్రత్యేకించి.. గ్లోబల్ సౌత్ దేశాలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. తీవ్ర ఎండల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 4,51,000 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

Climate Impact Lab Predicts Extreme Heat From El Nino May Cause 451000 Additional Deaths Next 6 Months

ఎల్ నినో పరిణామాలపై క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తన తాజా నివేదికను వెల్లడించింది. ఎల్ నినో ప్రభావంపై 1996 నుంచి 2025 మధ్య కాలాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. గ్లోబల్ సౌత్ దేశాల వాతావరణ స్థితిగతులు, ఉష్ణోగ్రత రికార్డులను కూడా తిరగేసింది. వాటన్నింటినీ క్రోడీకరించి.. ఈ నివేదికను రూపొందించింది. వచ్చే ఆరు నెలల కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల సంభవించే మరణాలు అన్ని గ్లోబల్ సౌత్ దేశాల్లోనూ నమోదు కావచ్చని పేర్కొంది.

ఎల్ నినో.. మరింత భీకరం: అంచనాలకు మించిన స్థాయిలో.. !!
ఎల్ నినో.. మరింత భీకరం: అంచనాలకు మించిన స్థాయిలో.. !!

ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో అత్యధికంగా 66,800 మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక్క నైజీరియాలోనే 31,400 మంది మరణించడానికి అవకాశం ఉంది. అలాగే సూడాన్‌- 17,500, నైగర్‌- 10,000, చాద్- 8,000 మంది ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవచ్చు. ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్, కాంబోడియాలలో కలిపి 19,400 మరణాలు సంభవించవచ్చని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అభిప్రాయపడింది.

గట్టిగా దెబ్బకొట్టిన ఎల్ నినో: విస్తుపోయే వాస్తవాలు
గట్టిగా దెబ్బకొట్టిన ఎల్ నినో: విస్తుపోయే వాస్తవాలు

భారత కూడా ఎల్ నినో, దానివల్ల సంభవించే మరణాల ముప్పును ఎదుర్కొంటోంది. ఎల్ నినో తీవ్రత కారణంగా దాదాపు 15,800 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోనేషియా- 19,300, బ్రెజిల్‌- 13,300 మంది ఈ ప్రమాదకర వాతావరణ మార్పుల పరిధిలో ఉన్నారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత అసాధారణంగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ దేశాల్లో నివారణ చర్యలతో పాటు తగిన రక్షణ ప్రణాళికలు అవసరమని సూచించింది.

మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్
మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్

ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా ప్రకారం ఈ ఎల్ నినో ప్రభావం ఇంకా గరిష్ఠ స్థాయికి చేరుకోలేదు. నవంబర్-డిసెంబర్ నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చనుంది. 2027 ఫిబ్రవరి వరకు దీని ప్రభావం దాదాపు 100 శాతం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాకు చెందిన నోవా శాస్త్రవేత్తలు కూడా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ దాటి నమోదయ్యానని ధృవీకరించారు.

రాబోయే కాలంలో పసిఫిక్ మహాసముద్రం మరింత వేడెక్కి, దీని ప్రభావం నేరుగా మానవ ప్రాణాలపై పడనుంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఫిబ్రవరి 2027 తర్వాత వచ్చే వచ్చే వేసవి కాలంలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరుకోవడం ఖాయమని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆగస్ట్.. అత్యంత వేడి నెలగా రికార్డయింది. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 16.96 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఇది 1850-1900 పారిశ్రామికీకరణ సగటు కంటే 1.65 డిగ్రీల సెల్సియస్ అధికం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+