Kavach 4.0: మల్కాజిగిరి-కామారెడ్డి మార్గంలో 108 కిలోమీటర్ల మేర కొత్త టెక్నాలజీ

భారతీయ రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సరికొత్త విప్లవానికి తెరలేచింది. మనదేశం స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన అత్యంత అధునాతన రైలు ప్రమాద నివారణ వ్యవస్థ 'కవచ్ 4.0' (KAVACH 4.0) తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మల్కాజిగిరి - కామారెడ్డి రైల్వే సెక్షన్ మధ్య ఉన్న 108 కిలోమీటర్ల మేర ఈ ఆధునిక వ్యవస్థను విజయవంతంగా అమర్చారు. పాత 'కవచ్ 3.2' వర్షన్‌తో పోలిస్తే మరిన్ని టెక్నికల్ అప్ డేట్స్, అత్యంత వేగంగా స్పందించేలా ఈ కొత్త వర్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్.. సిగ్నల్ దాటితే వెంటనే బ్రేక్!

ఈ 'కవచ్ 4.0' వ్యవస్థ ప్రధాన ఉద్దేశం రైలు ప్రమాదాలను ముందస్తుగానే అరికట్టడం. ఒకవేళ లోకో పైలట్ గమనించక పొరపాటున సిగ్నల్ దాటి ముందుకు వెళ్లినా (SPAD), లేదా నిర్ణీత వేగాన్ని మించినా ఈ సిస్టమ్ వెంటనే స్పందిస్తుంది. ఆటోమేటిక్‌గా బ్రేకులు పడేలా చేసి రైలును సురక్షితంగా నిలిపివేస్తుంది.

Kavach 4 0 Commissioned on South Central Railway Enhanced Safety Across Malkajgiri-Kamareddi Route
Kavach 4.0: 160 కిమీ స్పీడ్‌లో దూసుకొచ్చిన రైలు.. రెడ్ సిగ్నల్ పడగానే
Kavach 4.0: 160 కిమీ స్పీడ్‌లో దూసుకొచ్చిన రైలు.. రెడ్ సిగ్నల్ పడగానే

దట్టమైన పొగమంచు, వాన వంటి ప్రతికూల వాతావరణంలో కూడా ట్రాక్‌పై ఉన్న వివరాలను లోకో పైలట్‌కు డిజిటల్ స్క్రీన్‌పై స్పష్టంగా చూపిస్తుంది. అత్యున్నత భద్రతా ప్రమాణాలైన 'సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్-4' (SIL-4) ధృవీకరణ పొందిన ఈ వ్యవస్థ రైలు ప్రమాదాలను దాదాపు సున్నాకి తీసుకువస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Vande Bharat Kavach: వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్-మరో టెస్ట్ పాస్..!
Vande Bharat Kavach: వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్-మరో టెస్ట్ పాస్..!

ట్రాక్‌లపై ఆప్టికల్ ఫైబర్, లొకేషన్ గుర్తింపులో నిఖార్సైన కచ్చితత్వం!

కొత్త వర్షన్ 'కవచ్ 4.0'లో ప్రధానంగా సిగ్నలింగ్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. రైల్వే స్టేషన్ల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడి కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (OFC) వేయడంతో పాటు ట్రాక్‌ల వెంట ప్రత్యేక ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) ట్యాగ్‌లు, టవర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్ద పెద్ద రైల్వే యార్డుల్లో కూడా రైలు ఖచ్చితంగా ఎక్కడ ఉందో గుర్తించేలా లొకేషన్ ఆక్యురసీని పెంచారు. ఈ సాంకేతికతను రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే మార్గాల్లో విస్తరించేందుకు రైల్వే శాఖ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+