జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ కీలక పరిణామాలు - ఆంక్షలు, వైసీపీ ప్లాన్ బీ.!!

మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పరామర్శ కోసం బయల్దేరారు. జగన్ పర్యటన సమయంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అప్పలరాజు పరామర్శ వరకు మాత్రమే పరిమితం కావాలని నిర్దేశించారు. ర్యాలీలు.. సభలకు అనుమతి లేదని స్పష్టం చేసారు. అటు వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన వేళ తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ తన నివాసం నుంచి విశాఖ బయల్దేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకొని అప్పలరాజును పరామర్శిస్తారు. ఈ మేరకు ప్రోగ్రాం ఖరారైంది. అయితే.. జగన్ పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలు, భారీ జనసమీకరణలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. గతంలో జరిగిన ఘటనలు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జగన్ కాన్వాయ్ లో ఎనిమిది వాహనాలకే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షల నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా సాగనుందనేది ఉత్కంఠగా మారింది.

ys-jagan-gets-conditional-police-permission-for-srikakulam-visit-via-visakha-here-the-details

విశాఖ బయల్దేరిన జగన్.. పోలీసుల బందోబస్తు

కాగా.. అటు వైసీపీ నేతలు మాత్రం జగన్ కు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పటికే విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. అప్పలరాజు ములాఖత్ కు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. జగన్ వెళ్లే రూట్ ను వైసీపీ నేతలు ఖరారు చేసారు. అయితే.. పోలీసులు మాత్రం ఆంక్షలు అమలు చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. పోలీసులు తమను అడ్డుకుంటే ఏం చేయాలనే దాని పైన తమకు వ్యూహాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అటు వైసీపీ డీఎస్సీ అక్రమాల పైన పోరుబాట ఖరారు చేసింది. వరుసగా ఈ మేరకు చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో.. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు జగన్ రోడ్డు మార్గంలో వెళ్లనుండటంతో.. పోలీసుల ఆంక్షలు.. వైసీపీ నేతల ఏర్పాట్ల వేళ మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+