స్పీకర్‌కు రెడ్ ఫ్లాగ్ చూపించిన సుప్రీం.. అనర్హత పిటిషన్లపై హైడ్రామా.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ మార్పిడి రాజకీయాలు, అనర్హత వేటు అంశాలు మరోసారి అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎంపీల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకుంటున్న సుదీర్ఘ కాలయాపనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి కీలక అంశాలపై మూడు నెలలకు పైగా సమయం తీసుకోవడాన్ని కోర్టు ఒక 'రెడ్‌ ఫ్లాగ్'గా అభివర్ణించింది.

అసలేం జరిగింది? టీఎంసీలో చీలిక వివాదం

గత జూన్ నెలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకంగా 20 మంది లోక్‌సభ ఎంపీలు పార్టీ అధిగష్టానానికి వ్యతిరేకంగా గళం విప్పారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన వీరంతా తాము 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా'లో చేరినట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా లోక్‌సభలో తమను ఒక ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరుతూ అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. ఆ 20 మంది ఎంపీలు స్వచ్ఛందంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారని, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జూన్ 18న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విడివిడిగా పిటిషన్లు సమర్పించారు.

Supreme Court Calls 3-Month Delay in TMC Rebel Disqualification a Red Flag for Democracy in India

సుప్రీంకోర్టులో విచారణ.. న్యాయమూర్తుల కీలక వ్యాఖ్యలు

స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ అనర్హత పిటిషన్లపై సత్వర నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా ఈ అనర్హత పిటిషన్ల వల్ల దేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడుతుందని, అలాంటప్పుడు మూడు నెలల గడిచినా నిర్ణయం తీసుకోకపోవడం గమనించదగ్గ విషయమని కోర్టు పేర్కొంది. ఇది అత్యంత వేగంగా తేల్చాల్సిన విషయమని స్పష్టం చేసింది.

తృణమూల్ రెబెల్స్ కు ఈసారి లోక్ సభ షాక్..! 7 రోజుల డెడ్ లైన్..!
తృణమూల్ రెబెల్స్ కు ఈసారి లోక్ సభ షాక్..! 7 రోజుల డెడ్ లైన్..!

స్పీకర్ తరఫున వాదనలు.. గడువు కోరిన సోలిసిటర్ జనరల్

స్పీకర్ ఓం బిర్లా తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపిస్తూ, న్యాయస్థానం ఎలాంటి కఠినమైన గడువును విధించకూడదని కోరారు. స్పీకర్ ఒక అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని, ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తిరుగుబాటు ఎంపీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారు రాతపూర్వక సమాధానాలు ఇస్తారని కోర్టుకు వివరించారు.

'మీ అంతం చూసేంతవరకూ నేను బతికే ఉంటా'.. బీజేపీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
'మీ అంతం చూసేంతవరకూ నేను బతికే ఉంటా'.. బీజేపీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

కోర్టు తుది నిర్ణయం.. కేసు విచారణ వాయిదా

స్పీకర్ రాజ్యాంగబద్ధమైన అధికారాలను తాము గౌరవిస్తామని, అయితే అనర్హత పిటిషన్ల విషయంలో అనూహ్యమైన జాప్యం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్‌పై ఎలాంటి కఠినమైన గడువును రుద్దబోమని కోర్టు తేల్చిచెప్పింది. అయినప్పటికీ ఈ పిటిషన్‌ను కొట్టివేయకుండా సజీవంగా ఉంచుతున్నామని, స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చే పురోగతి నివేదికలను పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఎంపీల తరఫున సమాధానాలు దాఖలు చేయడానికి సమయం కోరడంతో, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+