'డీజే టిల్లు' రాధిక కాదు.. AI రాధిక.. నిజంగా అమ్మాయి అయితే ఎంత బాగుండో..?
ప్రస్తుతం సాంకేతిక, డిజిటల్ యుగం నడుస్తోంది. అసాధ్యం అనుకున్న ప్రతి పనిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) చేసి చూపిస్తోంది. ఇప్పుడు అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకుపోయింది. అయితే గతంలో ఏఐ టెక్నాలజీ సాయంతో న్యూస్ యాంకర్లను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల ను సైతం క్రియేట్ చేశారు నిపుణులు.
భారత్ లోనే మొట్టమొదటి AI-బేస్డ్ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ రాధిక సుబ్రమణ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ఓ ఏఐ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్. indiawithradhika అని ఇన్ స్టా ఖాతా ద్వారా రాధిక సుబ్రమణియన్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈమె పని ఏంటంటే.. దేశవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో వర్చువల్‌గా రాధిక పర్యటిస్తోంది. అక్కడ ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, వింతలు, విశేషాలు, ఫుడ్.. ఒక ట్రావెల్ వ్లాగర్ లాగా వీడియోలు, ఫోటోలు సేకరించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుటుంది.

ఏఐ రాధిక గురించి కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు, గ్రూప్ CEO విజయ్ సుబ్రమణ్యం కీలక విషయాలు తెలిపారు. రాధిక మనందరికీ తెలిసిన వ్యక్తిలా ఉంటుందన్నారు. ఆమె ఆలోచన, పని, స్వాతంత్ర్యం.. తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. ఒక స్నేహితురాలిగా కథలు చెప్పగలదన్నారు. మీరూ ఈ ఏఐ రాధికపై ఓ లుక్కేయండి.












Click it and Unblock the Notifications