ఏఐ తో ఖనిజాల వేట.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారి
ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పాత్ర పెరిగిపోతోంది. అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకుపోయింది. మానవ సాధ్యం కాని ఎన్నో సమస్యలకు ఏఐ పరిష్కారం చెబుతోంది. ఈ టెక్నాలజీని వివిధ రంగాల్లో వినియోగిస్తున్నారు. అయితే దేశంలోనే తొలిసారి ఏఐ ను ఉపయోగించి ఖనిజాల తవ్వకాలను చేపట్టనుంది రాజస్థాన్ ప్రభుత్వం.
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ను ఉపయోగించి రాష్ట్రంలోని ఖనిజ సంపదను వెలికి తీయనుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాయంతో ఖనిజాలను వెలికి తీయనుంది. 45 రోజుల్లో దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించనుంది. ఈ క్రమంలో దేశంలోనే ఈ విధానం చేపట్టిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుంది.
రాజస్థాన్ లో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఖనిజాలను గుర్తించి వాటిని తవ్వేందుకు సాధారణ పద్ధతులు కాకుండా మెరుగైన ఫలితాల కోసం ఈ సారి ఏఐ- మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను వినియోగించి ఖనిజాలను గుర్తించనుంది. దేశంలోనే ఈ విధంగా ఖనిజాలను గుర్తించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అవలంబించనున్నారు.

ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు కింద భిల్వారా, భరత్ పుర్, అలాగే ఛత్తీస్ గఢ్ లోని మరికొన్ని ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు రాష్ట్ర ఖనిజాలు, జియాలజీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ టీ. రవికాంత్ తెలిపారు. ఏఐతో సాయంతో సమయం, లేబర్ ఖర్చు తగ్గుతుందని.. అలాగే ఖనిజాల అన్వేషణ పూర్తి స్థాయిలో ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications