పేరెంట్స్ మాటలు వినొద్దు-కెరీర్ ప్లానింగ్ ఎలా ఉండాలంటే-తేల్చేసిన శామ్ ఆల్ట్ మన్..!
ప్రస్తుత ఏఐ తరంలో విద్యార్ధుల ఆలోచనలు, అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా భారతీయ యువత ఏఏఐవైపు పరుగులు తీస్తుందని భావిస్తున్న తరుణంలో.. ఇలా ఉంటే మీకు కెరీర్ కష్టమంటూ ఓపెన్ ఏఐ సీఈవో శ్యామ్ ఆల్ట్ మన్ (sam altman)తేల్చిచెప్పేశారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆల్ట్ మన్.. యువత చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటో బయటపెట్టారు. ఏఐ యుగంలో రాణించడానికి భారతీయ సంప్రదాయ కెరీర్ విధానాలు యువతకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని పేర్కొన్నారు.
పెద్దల మాటలు వినొద్దు (sam altman)
ఏఐ కోసం సిద్ధమవుతున్న యువత చేస్తున్న అతి పెద్ద తప్పు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా .. పెద్దల మాటలు వినడం అని ఆల్ట్ మన్ తేల్చేశాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తారని, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి, మంచి వ్యక్తిగా ఉండటానికి వారు అత్యుత్తమ సలహాలు ఇస్తారని, ఈ విషయాలలో మీ తల్లిదండ్రుల మాటలకు మించి మీరు ఎవరి మాటలనూ వినాల్సిన అవసరం లేదని తెలిపారు. కానీ, సంప్రదాయ కెరీర్ సలహాలు ఈ రోజుల్లో అంతగా పనికిరావన్నారు. మీరు త్వరగా మీ స్వంత జ్ఞానాన్ని పెంచుకుని, వాటిని నమ్మాలన్నారు.

సొంత జ్ఞానాన్నే నమ్ముకోండి
భవిష్యత్తును అంచనా వేయడంలో తనను కూడా నమ్మవద్దని శామ్ ఆల్ట్‌మన్ యువతకు సూచించారు. ప్రపంచం ఎలా మారబోతుందో అంచనా వేయడంలో, మార్పు వేగాన్ని అర్థం చేసుకోవడంలో తనను కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు తెలిపారు. యువతే ఎప్పుడూ దీన్ని బాగా అర్థం చేసుకుంటుందన్నారు. మీరు వారసత్వంగా పొందబోయే ప్రపంచం చాలా భిన్నంగా ఉండబోతోంది. మీరు త్వరగా మీ స్వంత జ్ఞానాన్ని పెంచుకుని వాటిని నమ్మాలన్నారు. అయితే, సంప్రదాయ కెరీర్ సలహాలు అంతగా పనికిరావన్నారు.

ఏఐతో ఉద్యోగాలు పోయినా..
ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగైనా, కొత్త పాత్రలు సాధారణంగా పుట్టుకొస్తాయని ఆల్ట్ మన్ వెల్లడించారు. ముఖ్యంగా స్థిరత్వానికి ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిలో యువత రిస్క్ తీసుకోవడాన్ని ఆల్ట్‌మన్ ప్రోత్సహించారు. చాలా మంది, ముఖ్యంగా భారతదేశంలో రిస్క్‌కు విముఖంగా ఉంటారు. విఫలమవడానికి నాకున్న సంసిద్ధతే విజయాన్ని అందిస్తుందన్నారు. అంతేకాకుండా 'జీరో పర్సన్ కంపెనీలు’ అనేది తక్కువ అంచనా వేయబడిన గొప్ప అవకాశమని, రాబోయే ఐదేళ్లలో విద్యారంగంలోనే అతి పెద్ద మార్పు ఉంటుందని సామ్ ఆల్ట్‌మన్ అంచనా వేశారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications