11 ఏళ్లకే బ్రిటన్ ఛాంపియన్: చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక!

భారత సంతతికి చెందిన చెస్ మేధావి 11 ఏళ్ల బోధనా శివానందన్, 17 ఏళ్ల శ్రేయస్ రాయల్ వారాంతంలో జరిగిన 2026 బ్రిటీష్ చెస్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఆదివారం కోవెంట్రీలో జరిగిన ఈ పోటీలో ముద్దుగా గోధన అని పిలవడే బోధన బ్రిటన్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు ఆమెను ఉత్సాహంగా ప్రోత్సహించారు. ఉత్కంఠభరితమైన ర్యాపిడ్ చెస్ ప్లేఆఫ్‌లో ఐర్లాండ్‌కు చెందిన 14 ఏళ్ల క్రీడాకారిణి త్రిషా కన్యమరాలను ఓడించి ఆమె ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు: రెండేళ్ల నిషేధానికి పీసీబీ సన్నాహాలు!
చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు: రెండేళ్ల నిషేధానికి పీసీబీ సన్నాహాలు!

అద్భుతం చేసిన బోధన
ఇంగ్లీష్ చెస్ ఫెడరేషన్ తరపున కామెంటేట‌ర్‌గా వ్యవహరిస్తున్న గ్రాండ్‌మాస్టర్ డానీ గోర్మల్లీ మాట్లాడుతూ, "నమ్మశక్యంకానిది! బోధన గెలిచింది. ఆమె ఓ అద్భుతమైన క్రీడాకారిణి. జనరేషన్‌లో ఒక్కసారి మాత్రమే కనిపించే ప్రతిభ ఆమెది" అని అన్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో విధించిన లాక్‌డౌన్ సందర్భంగా తన తండ్రి స్నేహితుడు ఇండియాకు తిరిగి వస్తూ ఒక చెస్ బోర్డుతో సహా కొన్ని బ్యాగులను వదిలి వెళ్లడంతో బోధన మొదటిసారిగా చెస్ ఆడటం ప్రారంభించింది.

11-Year-Old Bodhana Sivanandan Wins 2026 British Chess Championship Indian-origin prodigy Records

ఆ సమయంలో "నాకు చదరంగం పావులు చాలా ఆసక్తికరంగా అనిపించాయి, అందుకే నేను ఆడటం మొదలుపెట్టాను" అని బోధన చెప్పింది. అప్పటి నుండి వాయువ్య లండన్‌కు చెందిన ఈ పాఠశాల విద్యార్థిని నిలకడగా అనేక రికార్డులను బద్దలు కొడుతూ అత్యంత పిన్న వయస్కురాలైన విజయవంతమైన క్రీడాకారిణులలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకుంది. చదరంగంలోని ర్యాపిడ్ ఫార్మాట్‌లో ఆమె ఇప్పటికే యూకే ఓపెన్ మహిళల బ్లిట్జ్ ఛాంపియన్‌గా, సంయుక్త బ్రిటిష్ మహిళల ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు క్లాసికల్ ఫార్మాట్‌లో ఈ విజయంతో 11 ఏళ్ల బోధన ఓ అద్భుతమైన హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆమెకు ఏకైక ఓటమి ఆరో రౌండ్‌లో శ్రేయస్ రాయల్ చేతిలో ఎదురైంది.

India vs Sri Lanka 1st Test: శ్రీలంకతో తొలిటెస్టుకు టీమిండియా ఎలెవెన్ ఇదే..!
India vs Sri Lanka 1st Test: శ్రీలంకతో తొలిటెస్టుకు టీమిండియా ఎలెవెన్ ఇదే..!

మరోవైపు శ్రేయస్ రాయల్ తొమ్మిది రౌండ్ల తర్వాత పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఇంగ్లాండ్ అనుభవజ్ఞులైన గ్రాండ్‌మాస్టర్లను అర పాయింట్ తేడాతో అధిగమించి, మొత్తం పాయింట్ల ఆధారంగా బ్రిటిష్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తన మొదటి బ్రిటిష్ టైటిల్‌తో అతను ప్రపంచ స్థాయి వర్ధమాన చెస్ క్రీడాకారుడుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఇంగ్లాండ్ అత్యంత పిన్న వయస్కురాలైన గ్రాండ్‌మాస్టర్ అయిన తర్వాత శ్రేయస్.. "పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, ప్రయత్నిస్తూనే ఉండండి" అని చెప్పాడు. ఆగ్నేయ లండన్‌కు చెందిన ఈ టీనేజర్ ఆ తర్వాత బ్రిటన్ ప్రముఖ యువ చెస్ క్రీడాకారులలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకున్నాడు. 2026 ఈవెంట్‌ను బ్రిటిష్ చెస్ ఛాంపియన్‌షిప్ 122 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఈవెంట్‌గా అభివర్ణించారు, ఇందులో 1,750 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొనగా.. ఓపెన్ ఛాంపియన్‌షిప్‌కు రికార్డు స్థాయిలో 34,000 యూరోల ప్రైజ్ ఫండ్‌ను కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+