AI తో ఉద్యోగాలు పోగొట్టుకుంటోన్న వేళ.. అదే ఏఐతో సౌదీ అరేబియాలో లక్షలమందికి ఉపాధి
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. దాదాపుగా అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటోన్నాయి. మ్యాన్ పవర్ ను తగ్గించుకుంటోన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. లేఆఫ్ మీద లేఆఫ్స్ ప్రకటిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల్లో.. సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఏ ఏఐతో ఉద్యోగాలను పోగొట్టుకుంటోన్నారో.. అదే ఏఐతో లక్షలాదిమందికి ఉపాధిని కల్పించబోతోంది. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA).. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు AIలో శిక్షణ అందిస్తోంది

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3,34,000 మందికి పైగా పౌరులు లబ్ధి పొందారని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. నాన్-ప్రాఫిట్ సెక్టార్ ఫోరమ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ 2025 సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. రియాద్ లో ఈ సదస్సు ఏర్పాటైంది.
SDAIA ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అల్‌ఘమ్ది మాట్లాడారు. చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలకు AIలో శిక్షణ ఇవ్వడం వల్ల సత్ఫలితాలను సాధిస్తోన్నామని అన్నారు. ఏఐ ద్వారా తమ వ్యాపారాలను మరింత విస్తారం చేసుకోవడానికి వారికి అవకాశం లభించిందని, ఫలితంగా పలువురికి ఉపాధి ఇవ్వగలుగుతున్నారని చెప్పారు.
ఈ విషయంలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని, కమ్యూనిటీ అవగాహన పెంచడంలో రెండవ స్థానంలో ఉందని అబ్దుల్లా అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా డిజిటలైజేషన్, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యను అందించడంలో అగ్రదేశంగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోన్నామని చెప్పారు.
సౌదీ అరేబియా AI సాధికారత కార్యక్రమం 'SAMAI'. దీన్ని గత ఏడాది సెప్టెంబర్ లో గ్లోబల్ AI సమ్మిట్ సందర్భంగా ప్రారంభించింది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ డేటా అండ్ ఏఐ అథారిటీ, విద్యా మంత్రిత్వ శాఖ, మానవ వనరులు- సాంఘిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా దీన్ని పర్యవేక్షిస్తోన్నాయి.
'SAMAI' కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ప్రోగ్రామింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇందులో 2.6 లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్, సెకండరీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
'ఫ్యూచర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామర్స్' వంటి కార్యక్రమాలను AI ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్తోంది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగా చేపట్టిన రోడ్ టు ATHKA' అనే కార్యక్రమం ద్వారా 5,70,000 మందికి పైగా విద్యార్థులకు AIలో శిక్షణ శిక్షణ ఇచ్చింది. అలాగే- 'ఫ్యూచర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామర్స్' కార్యక్రమం కింద మరో 10,000 మందికి పైగా ఉపాధ్యాయులు AIలో ట్రైనింగ్ పొందారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications