స్టాక్ మార్కెట్ ను ఏం చేయబోతున్నారు?
దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ విస్త్రతమౌతోంది. దీని వినియోగం అమాంతంగా పెరుగుతోంది. ఐటీ సెక్టార్ లో ఆరంభమైన ఏఐ విప్లవానికి అడ్డు ఉండట్లేదు. ప్రాథమిక విద్య- వైద్య రంగాల్లో సైతం ఈ టెక్నాలజీని వినియోగిస్తోన్నారంటే.. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితుల మధ్య- స్టాక్ మార్కెట్ కూడా ఏఐ వైపు మొగ్గు చూపుతోంది. ఏఐ, ఎంఎల్ షేర్ మార్కట్ లో వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) విడుదల చేసింది. ఇదొక విప్లవాత్మక నిర్ణయంగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఏఐ వినియోగంపై జూలై 11లోగా అభిప్రాయాలను స్వీకరించనుంది సెబీ. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్స్ అల్గారిథమిక్ ట్రేడింగ్, క్లయింట్ ఆన్ బోర్డింగ్ నుండి నిఘా, సైబర్ సెక్యూరిటీ వరకు అనేక పనుల కోసం ఏఐ టూల్స్ వినియోగించాల్సిన అవసరం ఏర్పడినట్లు తెలిపింది.
వీటి వినియోగం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ లో జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతుందని, దీనికి అనుగుణంగానే మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాను రూపొందించామని సెబి పేర్కొంది. మోడల్ గవర్నెన్స్, స్టేక్ హోల్డర్ల ప్రైవసీ, పెట్టుబడులను పరిరక్షించడం వంటి అంశాలను ఈ ముసాయిదాలో పొందుపరిచినట్లు తెలిపింది.
మార్కెట్ భాగస్వామ్య కంపెనీలు ఇప్పటికే ఏఐ మోడళ్లను అనుసరిస్తోన్నాయని, వాటి అభివృద్ధి, విస్తరణ, ఆడిటింగ్.. వంటి విభాగాల్లో ఈ టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిందని సెబి పేర్కొంది. దీనికి అనుగుణంగా స్టాక్ మార్కెట్ లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని మరింత విస్త్రంగా వినియోగించాలని ప్రతిపాదించినట్లు వివరించింది.
స్టాక్ మార్కెట్ లో అత్యంత ప్రాధాన్యత ఉండే సిస్టమ్ ల కోసం ఫాల్ బ్యాక్ ప్లాన్ లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని, దీని పర్యవేక్షణ బాధ్యతను సీనియర్ మేనేజ్‌మెంట్ కు అప్పగించాలని సెబి ప్రతిపాదించింది. పోర్ట్ ఫోలియో నిర్వహణ, ట్రేడింగ్, ఆర్థిక సలహా వంటి విభాగాల్లో ఏఐని వినియోగించడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని సెబీ భావిస్తోంది.
డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయానికి వస్తే.. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఏఐ వినియోగం ఉంటుందని ఇన్వెస్టర్లకు సెబి భరోసా ఇస్తోంది. ఎటువంటి ఉల్లంఘనలు గానీ, లోపాలను గానీ తలెత్తకుండా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వివరించింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications