Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ హిట్టు కొట్టేశాడు భయ్యా..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రిలీజవుతున్న ప్రతి పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అటు హాలీవుడ్.. బాలీవుడ్ అని తేడా లేకుండా వరుసబెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకులు మాత్రం అన్నింటినీ ఆదరిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి మన శంకర్ వర ప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఆ తర్వాత వేసవిలో పెద్ద సినిమాల ఊసే లేదు. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయినా అవి పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత జూన్ నుంచి సినిమాలు వరుసగా హిట్ అవుతూ వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సమంత మా ఇంటి బంగారం, అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాలు వరుసగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాయి. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ కూడా ప్రేక్షకుల్ని మెప్పించి సూపర్ హిట్ అయింది. దాంతో తెలుగు చిత్ర సీమలో పండగ వాతావరణం నెలకొంది. ఇక అటు హాలీవుడ్ నుంచి వచ్చిన ది ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.

20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!

ఇక ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వంతు వచ్చింది. ఆయన హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హార్రర్ కామెడీ జానర్ లో ఇండో కొరియన్ ఫిల్మ్‌ గా తెరకెక్కింది. కొరియన్ కనకరాజు సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా చూసిన వారు తమ ఒపీనియ‌న్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ముఖ్యంగా హార్రర్ కామెడీ, వరుణ్ తేజ్ నటన, థమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని టాక్ వినిపిస్తోంది.

VarunTej movie first review of Mega Prince Varun Tej s Korean Kanakaraju here s the word on it

అలాగే సినిమాలోని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌ లో కొన్ని ఎపిసోడ్స్ హిలేరియస్‌ గా ఉన్నాయని సెన్సార్ టాక్ ద్వారా తెలుస్తోంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ డ్యూయల్ షేడ్స్ రోల్‌ లో నటించారు. ఓ వైపు అనంతపురం యువకుడిగా, మరోవైపు కొరియన్ ఆత్మ ఆవహించిన గ్యాంగ్‌ స్టర్‌ గా అద్భుతంగా నటించారని చెబుతున్నారు. అనంతపురంలోని కనకరాజుకు కొన్ని అనుకోని సంఘటనల కారణంగా కొరియన్ ఆత్మ పడుతుంది. కనకరాజు బాడీతో కొరియా వెళ్లిన ఆ ఆత్మ అక్కడ ఏం చేసింది అనేది సినిమా కథ.. అని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన పూర్తి రివ్యూ కావాలంటే ఆగస్టు 7 వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+