SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్..! అంతరిక్షంలో దుర్ఘటన..!

అంతరిక్షంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. స్పేస్ ఎక్స్ సంస్ద పంపిన ఫాల్కన్-9 రాకెట్‌ (spaceX rocket)కు చెందిన, విడిచిపెట్టిన పైభాగం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో చంద్రునిపై ఉన్న ఐన్‌స్టీన్ బిలం సమీపంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనను శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా నిర్దారించాల్సి ఉంది. దాదాపు 4500 కిలోల బరువు ఉన్న ఈ రాకెట్ పైభాగం చంద్రునిపైకి బ్లూ ఘోస్ట్ మిషన్‌ను ప్రయోగించాక 19 నెలల పాటు అంతరిక్షంలో తేలుతూ ఉంది. ఇవాళ ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం.

మరికాసేపట్లో.. నెలవంక చంద్రుడి వెనక్కి శుక్రుడు!
మరికాసేపట్లో.. నెలవంక చంద్రుడి వెనక్కి శుక్రుడు!

2025 జనవరి 15న స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌ ను ప్రయోగించింది. ఇది దశలవారీగా విడిపోతూ చంద్రుడిపైకి రాకెట్ పైభాగం మాత్రమే వెళ్లింది. అక్కడ ఈ రాకెట్ పైభాగం మాత్రమే చంద్రుడిని ఢీకొట్టింది. అసలు రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత ఇది మండుతూ చంద్రుడిపైకి వెళ్తుంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్ ఇంధనం అయిపోయిన తర్వాత, సౌర కార్యకలాపాలు, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి క్రమంగా రాకెట్ దశ గమనాన్ని మార్చేసినట్లు సమాచారం. భూమికి, చంద్రుడికి మధ్య ఒక విశాలమైన, అస్థిరమైన వలయంలో 19 నెలలుగా ఇది తిరుగుతూ ఉంది. నెలల తరబడి, భూమి, చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ వల్ల కలిగే రాపిడి, వాటితో పాటు సూర్యరశ్మి యొక్క ఒత్తిడి కలిసి దాని మార్గాన్ని క్రమంగా ముందుకు నెట్టాయని తెలుస్తోంది. చివరికి ఆ చిన్న చిన్న నెట్టడాలు అన్నీ కలిసి నేరుగా భూమిని ఢీకొట్టేలా చేశాయి.

SpaceX Rocket May Have Crashed Into the Moon Experts Await Verification

108 దేశాల పోటీని దాటుకుని.. ఇస్రో కల వైపు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
108 దేశాల పోటీని దాటుకుని.. ఇస్రో కల వైపు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

ఆ స్టేజ్‌ను పాసివేట్ చేశామని, అంటే దానిలోని ఇంధనాన్ని పూర్తిగా తీసివేసి సురక్షితం చేశామని, కానీ అంతటి అధిక శక్తి మార్గాలలో ప్రయాణించే స్టేజ్‌లకు నియంత్రిత పద్ధతిలో ఇంధనాన్ని పారవేసే ప్రక్రియ సాధ్యం కాదని స్పేస్‌ఎక్స్ తెలిపింది. ఇది సుమారుగా గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టి ఉంటుంది. ఇది దాదాపు మూడు టన్నుల టీఎన్టీకి సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. చంద్రునికి గాలి నిరోధం లేదా ఘర్షణను కలిగించే వాతావరణం లేనందున, రాకెట్ దాదాపు పూర్తి వేగంతో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. చంద్రునిపై నుంచి ప్రయాణిస్తున్న మన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఈ ప్రమాద స్ధలాన్ని గుర్తించగలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+