Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వచ్చే ఏడాది ఏఐ షాకులే..! 89శాతం ఉద్యోగాలపై..! CNBC సర్వేలో..!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ ప్రభావం అంతకంతకూ పెరిగిపోతుంది. ప్రతీ కంపెనీ వీలైనంతగా ఏఐ వాడకాన్ని పెంచుకుని ఉద్యోగుల్ని సాగనంపేందుకు వ్యూహరచనలో నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు షాకిచ్చే వార్త అందుతోంది. తాజాగా CNBC నిర్వహించిన సర్వేలో ఏఐ వచ్చే ఏడాది 89 శాతం ఉద్యోగాలపై ప్రభావం చూపబోతోందని తేలింది. దీంతో ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

కృత్రిమ మేథ ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీ హెచ్ఆర్ లీడర్స్ తో కూడిన CNBC వర్క్‌ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గత వారం ఫ్లాష్ సర్వే నిర్వహించారు. ఇందులో ఏఐ ప్రస్తుతం వారి సంస్థలలో ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందా అని అడిగినప్పుడు, హెచ్ఆర్ లీడర్స్.. మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఇది ఉద్యోగి గత పనులలో గణనీయమైన భాగాన్ని ఆటోమేట్ చేయడం లేదా వారు రోజువారీగా పనిచేసే విధానాన్ని మార్చబోతోందని చెప్పారు.

The AI Job Shock 89 of Roles Will Be Affected Next Year According to HR Leaders

ఈ సర్వేలో పాల్గొన్న 21 మంది సీనియర్ హెచ్ ఆర్ లీడర్స్ లో దాదాపు 50శాతం మంది తమ సంస్థలలోని సగం కంటే తక్కువ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపిందని చెప్పారు. అదే సమయంలో దాదాపు సగం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రభావితమయ్యాయని 17 శాతం మంది చెప్పారు, మరో 11శాతం మంది అనిశ్చితంగా ఉన్నారని తెలిపారు. 22 శాతం మంది మాత్రం ఉద్యోగాలపై దీని ప్రభావం లేదన్నారు.

అయితే సర్వే చేసిన సీనియర్ హెచ్ ఆర్ లీడర్స్ లో 89 శాతం మంది వచ్చే ఏడాది ఏఐ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. దాదాపు 45 శాతం మంది AI దాదాపు సగం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందన్నారు. 44 శాతం మంది ఇది అన్ని ఉద్యోగాలపై సగం కంటే తక్కువ ప్రభావాన్ని ఏఐ చూపుతుందని చెప్పారు. మరో 11 శాతం మంది ఎటువంటి ఉద్యోగాలపై ప్రభావం చూపదని చెప్పారు.

The AI Job Shock 89 of Roles Will Be Affected Next Year According to HR Leaders

వచ్చే ఏడాది తమ ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని చూస్తున్న హెచ్ఆర్ లీడర్స్.. ద్రవ్యోల్బణం, సుంకాలు, తగ్గిన డిమాండ్ లేదా ఏఐ నుండి వచ్చే లాభాల కంటే వారు చెప్పిన ఏకైక కారణం ఖర్చులను తగ్గించుకోవాల్సిన సాధారణ అవసరం ఉందన్నారు. ఈ సర్వేలో ఐదుగురిలో ముగ్గురు ఏఐ తమ కంపెనీని మరింత సమర్థవంతంగా చేసిందని పేర్కొన్నారు. అయితే 39 శాతం మంది ఇప్పుడే ఇలా చెప్పడం తొందరపాటే అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+