AI లో రేసులో నంబర్ వన్‌గా ఉండాలి - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ !
అమెరికాను కృత్రిమ మేధస్సు (AI) రంగంలో నిలిపేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు మూడు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ముఖ్యంగా "వోక్ AI" (Woke AI) మోడల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఉత్తర్వులు అమెరికాను "AI రంగంలో టాప్ లో ఉంచేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.
ట్రంప్ ఏమన్నారంటే..
వాషింగ్టన్‌లో జరిగిన AI సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచం ఇప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వస్తున్న సాంకేతికతతో విప్లవాత్మక దశలోకి వెళ్తోంది. అమెరికా AI రేసులో ముందుంటుంది. నేను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం, అమెరికా గెలుస్తుంది" అని అన్నారు.

మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులు..
"వోక్" AIపై కఠిన నియంత్రణలు:
AIలో రాజకీయ పక్షపాతం లేదా ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహించే మోడల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డేటా సెంటర్ల మౌలిక సదుపాయాల వేగవంతం :
డేటా సెంటర్ అనుమతులు, నిర్మాణాలకు సంబంధించిన సమాఖ్య అనుమతులను క్రమబద్ధీకరించి వేగవంతం చేయాలని ట్రంప్ పేర్కొన్నారు.
AI ప్రోత్సాహకం:
అమెరికన్ టెక్ కంపెనీలను ప్రోత్సహిస్తూ, AI రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అందుకు గాను ఈ ఉత్తర్వులతో పాటు, వైట్ హౌస్ "విన్నింగ్ ది రేస్" పేరుతో 24 పేజీల AI యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. AI రీసెర్చ్‌లో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం, గ్లోబల్ AI పోటీలో అమెరికాను ముందుండేలా చేయడం వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఈ ప్లాన్, బైడెన్ కాలం నాటి AI ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేసింది.
అంతే కాకుండా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, "నాకు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అనే పేరు నచ్చదు. 'ఆర్టిఫిషియల్' అనే పదం అసలైనదనిపించదు. మనం ఈ పేరును మార్చాలి. ఎందుకంటే ఇది నిజమైన మేధస్సే" అని తెలిపారు.
చైనా పోటీపై హెచ్చరిక..
మరోవైపు చైనా AI చిప్స్, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోకూడదని ట్రంప్ హెచ్చరించారు. చైనా ఆధిపత్యానికి సవాలు విసురుతున్న DeepSeek వంటి సంస్థల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "అమెరికా AIలో నంబర్ వన్‌గా కొనసాగుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.
-
ఈ ఫోటోలో ఉన్న 5 పుస్తకాలను కనిపెట్టగలరా..? -
ఏఐ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ కొత్తరోగం వచ్చే ఛాన్స్ ?? -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications