2019 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. ఇందులో ఎలాంటి అంశాలను పొందుపరిచి ఉంటాయనేది మనకు తెలుసు. ప్రజల అవసరాలు, ఉద్దేశాలు, వారి లక్ష్యాలు ప్రతిఫలించేలా మేనిఫెస్టోలకు తుది రూపాన్ని ఇస్తాయి. వాటన్నింటినీ మనం ఒకసారి పరిశీలిద్దాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, ఆర్థిక రంగాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాయనే విషయాన్ని తెలుసుకుందాం. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో రంగాలవారీగా ఉన్న సారూప్యాన్ని ఒక్క క్లిక్ తోనే పరిశీలిద్దాం. దీనికోసం- పార్టీ పేరుపై, తెలుసుకోవాల్సిన అంశంపై క్లిక్ చేయండి. వివిధ అంశాలవారీగా మేనిఫెస్టోల్లో ఉన్న సారూప్యాన్ని తెలుసుకోండి
--మొదటి పార్టీని ఎంచుకోండి--
--రెండో పార్టీని ఎంచుకోండి--
--మూడో పార్టీని ఎంచుకోండి--
Education
Education
Education:
మెరుగైన విద్యా బోధన కోసం ఉపాధ్యాయ శిక్షణ ప్రమాణాల పెంపు. దీనికోసం జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంలో భాగంగా.. ఈ కేంద్రంలో నాలుగేళ్ల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ. తరగతి గదుల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు. కొత్తగా 200 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటు.
Education:
కాంగ్రెస్ 2023-24 నాటికి ముగిసే అయిదేళ్ల జీడీపీలో విద్యాశాఖకు కేటాయించే నిధులను రెండింతలు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించడం తప్పనిసరి చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయా విద్యాలయాల సంఖ్య పెంపు. వైద్యం, ఇంజినీరింగ్, కామర్స్, మేనేజ్ మెంట్ వంటి ఉన్నత విద్యను బోధించే విద్యాసంస్థల సంఖ్య పెంపు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విద్యార్థుల హక్కు చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొస్తుంది. విద్యాహక్కు, సమాచార హక్కు చట్టం తరహాల్లో ఇది పనిచేస్తుంది.