మరోసారి గెలిపిస్తే చిత్తూరు చేతికి చిప్ప గ్యారెంటీ, పెద్దిరెడ్డి హవాకు బ్రేకులు వేస్తున్న కూటమి!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల బహిరంగ ప్రచారానికి తెరపడింది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా విజయం సాధించి సత్తా చాటుకోవాలని అన్ని పార్టీల నాయకులు కలలు కంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హవాకు చెక్ పెట్టాని పక్కాప్లాన్ తో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హవా ఎలా ఉందో అనే విషయం రాజకీయాలు తెలిసిన వాళ్లకు కొత్తగా చెప్పనవసరంలేదు. పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయం సాధించడం పక్కా అని చాలా మంది నాయకులు అంటున్నారు. పెద్దిరెడ్డి ఆశీస్సులతో గత ఎన్నికల్లో చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఎన్ రెడ్డప్ప ఎంపీగా విజయం సాధించారు.

చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి వైసీపీ టిక్కెట్ తో మరోసారి ఎన్. రెడ్డప్ప పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఆశీస్సులతో రెడ్డప్ప మరోసారి ఎంపీ అవుతారని చాలా సర్వేలు ఇప్పటికే చెప్పాయి. ఎస్సీ రిజర్వడ్ నియోజక వర్గం అయిన చిత్తూరులో వైసీపీ అభ్యర్థి రెడ్డప్పను ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన దగ్గుమళ్ల ప్రసాదరావును రంగంలోకి దింపారు.
సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పకు గట్టిపోటీ ఇస్తున్న ప్రసాదరావు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి తాను కచ్చితంగా విజయం సాధిస్తానని ప్రసాదరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనో ఆంధ్రప్రదేశ్ 25 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని, గతంలో రెడ్డప్పను ఎంపీగా గెలిపిస్తే కనీసం ఎంపీ నిధులు కూడా ఖర్చు చెయ్యకుండా నిర్లక్షం చేశారని, ఆయన్ను మరోసాసి గెలిపిస్తే చిత్తూరు ప్రజలకు చిప్ప మాత్రమే మిగులుతుందని ప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవాకు బ్రేకులు వెయ్యాలని, తనతో పాటు జిల్లాలోని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రసాదరావు మనవి చేస్తున్నారు. ఎన్ రెడ్డప్పను మరోసారి గెలిపిస్తే ఆయన ఏ పని చెయ్యడని, ప్రజలకు కష్టాలు తప్పవని టీడీపీ అభ్యర్థి ప్రసాదరావు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి రబ్బరు స్టాంపుగా మారిన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డను ఓడించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం కూటమి ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు ప్రజలకు మనవి చేస్తున్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications