Exit Poll: ఎన్ని ఎంపీ సీట్లు తేల్చేసిన బీజేపీ లీడర్స్, గతంలో కంటే మైనస్ మెజారిటీ ?

2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక 20కి పైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ ధీమాగా ఉంది. ముఖ్యంగా బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌. యడ్యూరప్పతో పాటు ఘటానుఘటి నేతలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. కర్ణాటకలో మాకు 20 ఎంపీ సీట్లు వస్తాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని శనివారం బీజేపీ సీనియర్ నాయకులు జోస్యం చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న కొన్ని గంటల ముందు బీజేపీ నాయకులు ఇలాధీమా వ్యక్తం చెయ్యడంతో ఆ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. అంటే బీజేపీ 20కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమా? అనే విషయం జూన్ 4వ తేదీన కచ్చితంగా తెలిసిపోతుంది. భారతదేశం ప్రజాస్వామ్య దేవాలయం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం అనే విషయం తెలిసిందే.

BS Yeddyurappa is confident that he will win more than 20 MP seats in Karnataka

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్‌ సాధించి కేంద్రంలో మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎన్డీయే కూటమి సిద్ధమైంది. ఈసారి కనీసం 400 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ చేసింది. బీజేపీ మిషన్ 400 సక్సెస్ అవుతుందా? ఈ మాస్టర్ ప్లాన్ కు కర్ణాటకలో 20కి పైగా సీట్లు వస్తాయా? బీజేపీ నేతల మాటలు నిజమవుతాయా? అనే విషయంలో జూన్ 4వ తేదీన కచ్చితంగా క్లారిటీ వస్తుంది.

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అందుకోసం ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా అన్ని పార్టీల్లోనూ గెలుపు ఓటముల భారీ లెక్కింపు మొదలైంది. అలాంటప్పుడు బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అనే చర్చ ఇప్పటికే మొదలైంది. గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 సీట్లకు గాను 25 సీట్లను బీజేపీ గెలుచుకుంది.

28 ఎంపీ సీట్లు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అనే పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం బీజేపీ 20కి పైగా సీట్లు గెలుచుకోవచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ కూడా బీజేపీకి ఎన్నడూ లేని విధంగా ఈసారి గట్టి పోటీ ఇచ్చింది. కర్ణాటక లోక్ సభ ఎన్నికల రంగంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉచిత గ్యారంటీల హామీ వర్కవుట్ అయినందున బీజేపీ 20కి పైగా సీట్లు గెలుచుకోగలదా అనే టాక్ వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్ సభ ఎన్నికలు వేరు, ఫలితాలు మీరే చూస్తారు కదా అని బీజేపీ నాయకులు ధీమాగా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+