వైఎస్ఆర్ వారసులు ఎవరు ?, వాళ్ల ఇంటి ముందు కుక్కల్లా ఉండాలా ?, వైఎస్ వివేకా కూతురు !

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మలు శాంతించాలంటే కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్. అవినాష్ రెడ్డిని ఓడించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అని, కడప లోక్ సభ ఎంపీగా పోటీ చేస్తున్న తన సోదరి వైఎస్ షర్మిలాకు మీరు అందరూ ఓటు వేసి గెలిపించాలని సునీతా మనవి చేశారు.

బద్వేలు అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన వైఎస్ వివేకా కుమార్తె సునీతా ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మీద, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలంటే సులభంగా ఉంటుందోమో కాని కడప ఎంపీ అవినాష్ రెడ్డి దర్శనం కావాలంటే చాలా కష్టం అని, ఆయన ప్రజలకు చిక్కడని సునీతా ఎద్దేవ చేశారు.

YS Viveka s daughter Sunitha is targeting Kadapa MP YS Avinash Reddy and campaigning for elections

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలవాలంటటే ఆయన ఇంటికి ముందు వేకువ జామున నుంచి క్యూలో కుక్కల్లా నిలబడాలని, ఆయనకు మూడ్ ఉంటే మాట్లాడుతారని, లేదంటే మరోసారి ఆయన ఇంటికి దగ్గరకు వెళ్లి వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్ వివేకా కుమార్తె సునీతా ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా కడప జిల్లా ప్రజలకు మనవి చేశారు.

YS Viveka s daughter Sunitha is targeting Kadapa MP YS Avinash Reddy and campaigning for elections

ప్రజలకు సేవ చేస్తున్న అమాయకుడైన తన తండ్రి వైఎస్ వివేకాను కొందరు గొడ్డలితో నరికి నరికి చంపేశారని, అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఆయన సహించేవారు కాదని, హంతకులకు ఇప్పటికే శిక్షపడేలా మా పెద్దనాన్న చూసుకునేవారని, కాని ఆయన లేకపోవడంతో మాకు అన్యాయం జరుగుతోందని సునీత విచారం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకా ఆత్మలు శాంతించాలంటే కడప లోక్ సభ ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటు వెయ్యాలని వైఎస్ వివేకా కుమార్తె సునీతా ప్రజలకు మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+