నాగ్ సినిమా తెచ్చిపెట్టిన కష్టాలు: పీకల్లోతు ఇరుక్కున్న ధనుష్
ప్రముఖ తమిళ నటుడు ధనుష్.. చిక్కుల్లో పడ్డాడు. ఓ సినిమా ఆయనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. శాపంగా మారింది. అసంపూర్తిగా నిలిచిపోయిన మూవీ అది. దాన్ని కంప్లీట్ చేయకపోవడం అతనికి సవాల్ గా మారింది. 2016లో క్లాప్ కొట్టిన ఈ మూవీ.. ఇప్పటికీ సెట్స్ పైకి వెళ్లలేదు. హైబడ్జెట్ తో తెరకెక్కాల్సిన చిత్రం అది. పూర్తయివుంటే అతని లెక్క వేరుగా ఉండేది గానీ బెడిసికొట్టింది. అతని కేరీర్ లో ఓ అన్ ఫినిష్డ్ మూవీగా నిలిచింది.
ఈ సినిమా ప్రాజెక్టుల విషయంలో ప్రముఖ నటులు ధనుష్ ఒక్కడే కాదు, మరో కేసులో రణ్ వీర్ సింగ్ కూడా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నాడు. ప్రాజెక్టుల జాప్యం లేదా నిలిచిపోవడం వల్ల జరిగిన ఆర్థిక నష్టాలకు పరిహారం కోరుతూ పలు నిర్మాణ సంస్థలు వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు లీగల్ నోటీసులు సైతం పంపించాయి. తాజాగా ధనుష్‌కు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ థేనాండాళ్ ఫిల్మ్స్ నుండి ఈ లీగల్ నోటీసు అందింది. 20 కోట్ల రూపాయల పరిహారం కోరుతూ ఈ నోటీసు ఇచ్చింది.

2016లో థేనాండాళ్ బ్యానర్ లో ఓ భారీ సినిమాను చేయాల్సి ఉంది ధనుష్ కు. 'నాన్ రుద్రన్' అనే పేరును కూడా ఖరారు చేశారు అప్పట్లో. దీనికి ధనుషే హీరో, దర్శకుడు కూడా. అక్కినేని నాగార్జున, ఎస్ జే సూర్య సహా పలువురు స్టార్ క్యాస్టింగ్ ను సెలెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ థేనాండాళ్ ఫిల్మ్స్ కు మరో బ్లాక్ బస్టర్ చిత్రం చేస్తానని హామీ ఇచ్చాడు గానీ దాన్ని నెరవేర్చుకోలేదు. ఇదే విషయాన్ని ఆ ప్రొడక్షన్ హౌస్ తాజా నోటీసుల్లో పేర్కొంది.
అడ్వాన్స్ చెల్లింపులు, ప్రీ ప్రొడక్షన్ ఖర్చులతో పాటు నాగార్జున, ఎస్ జే సూర్య వంటి నటుల పారితోషికాలతో కలిపి 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది. స్క్రిప్ట్ సమర్పించకపోవడం, ఇతర బాధ్యతలకు ధనుష్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఆలస్యమైందని ఆరోపించింది. ధనుష్ వారం రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తికి తేదీలు కేటాయించాలని నోటీసు కోరింది. స్పందించని పక్షంలో తాము ఈ మూవీపై ఖర్చు చేసిన మొత్తంతో పాటు అదనంగా కోటి రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా 'డాన్ 3' ప్రాజెక్ట్ నుండి వైదొలగిన తరువాత ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వివాదంలో చిక్కుకున్నారు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో జరిగిన నష్టాలను పేర్కొంటూ, నిర్మాణ సంస్థ దాదాపు రూ. 40 కోట్ల పరిహారాన్ని కోరుతోంది. రణవీర్ టీమ్ ఈ ఆరోపణలను ఖండించింది. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన నోటీసుపై సవాల్ చేసింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications