ప్రభాస్ స్పిరిట్ ను తలదన్నేలా.. సందీప్ రెడ్డి వంగా డబుల్ డోస్: ఆ మూవీకి సీక్వెల్ అనౌన్స్
సందీప్ రెడ్డి వంగా.. పరిచయం అక్కర్లేని పేరు. రణబీర్ కపూర్- రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కించిన యానిమల్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్నీ టాలీవుడ్ వైపు చూపు తిప్పుకొనేలా చేశాడు. అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసిందీ మూవీ. సుమారు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కిన యానిమల్.. రూ. 950 కోట్లను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ స్పిరిట్ తీస్తోన్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదలైంది.
దీని తర్వాత తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. దీని టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశాడు. అదే- యానిమల్ పార్క్ (Animal Park). భారీ విజయం సాధించిన యానిమల్ కు ఇది సీక్వెల్. జపాన్‌లో జరిగిన ముఖాముఖి సందర్భంగా తన ఆలోచనలను వివరించాడు. ఇది ఒకరినొకరు పోలిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధమని తెలిపాడు. అందుకే- దీనికి 'యానిమల్ పార్క్' అనే టైటిల్ యాప్ట్ గా అనిపించిందని అన్నాడు.

ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న స్పిరిట్ ప్రాజెక్ట్ పూర్తికాగానే యానిమల్ పార్క్ చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సీక్వెల్‌లో మరింత మంది "జంతువులు" ఉంటారని చెప్పాడు.. అంటే కథ మరింత లోతుగా, విస్తృతంగా, రగ్డ్ అండ్ రా లుక్ తో ఉంటుందని అర్థం. యానిమల్ పార్క్ అని టైటిల్ పెట్టడం వల్ల ఒకటికి మించి అనేక జంతువులు ఇందులో ఉంటాయని పరోక్షంగా వివరించినట్టయింది. రణబీర్ కపూర్ ఒక్కడితోనే యానిమల్ తరహా బిహేవియర్ ను చూపించాడు వంగా.
దీని సీక్వెల్ లో మరింతమంది యాక్టర్లు యానిమల్ లా బిహేవ్ చేస్తారని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ 2027 మే/జూన్ తర్వాత ప్రారంభం అవుతుందని వంగా ధృవీకరించారు. యానిమల్ లో రణ్ విజయ్‌గా నటించిన రణబీర్ కపూర్ ఈ ఫ్రాంఛైజీలోకి తిరిగి రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు. వంగా సృష్టించిన భీకర ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. సందీప్‌తో కలిసి సెట్‌కి వచ్చి ఈ డ్యూయెల్ రోల్ ను పోషించడానికి అప్పటివరకు వేచి ఉండలేనని రణబీర్ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications