అవార్డులు కొల్లగొడుతున్న "అన్నపూర్ణ కాలేజ్" స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ ఫిల్మ్..

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విద్యార్థులు అద్బుత ప్రతిభ కనబరిచారు. విద్యార్ధులు రూపొందించిన "మాయ" గ్రాడ్యుయేషన్ చిత్రం జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో విశేష ప్రశంసలు అందుకుంది. అధికారిక ఎంపికలు, సెమీ-ఫైనలిస్ట్ గుర్తింపులు, అవార్డులు సాధించి, కళాశాలకు, చిత్ర బృందానికి ఘన విజయాన్ని అందించింది. స్వర్ణ రేఖ ప్రభు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ "మాయ" చిత్రం సామూహిక కృషికి నిదర్శనం.

ఈ ప్రయాణం గురించి దర్శకురాలు స్వర్ణ రేఖ ప్రభు మాట్లాడుతూ.. మాయ నా సొంత కల నుంచి పుట్టిందని తెలిపారు. ఇది ఉపచేతనను ఈ చిత్రానికి రచయితగా మార్చింది. ఈ చిత్రం మనం కలలలో అనుభవించే వివిధ భావోద్వేగాలను ఒక రోలర్-కోస్టర్ రైడ్ లాగా చిత్రీకరిస్తుంది. ఇది కొన్నిసార్లు అర్థరహితంగా అనిపించినా.. తరువాత వాటిని కలిపి చూసినప్పుడు, మన ఉపచేతన అందించిన గుప్త సందేశాన్ని మనం అర్థం చేసుకోగలమని వివరించారు.

graduation-film-by-annapurna-college-wins-annual-national-international-awards

అలానే మనలో చాలామంది చనిపోయిన మన ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి కలలను ఒక మార్గంగా ఎంచుకుంటారు. ఇది చనిపోయిన ప్రపంచానికి ఒక మార్గం అని శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ.. ఇది వాటిని ప్రత్యేకంగా చేస్తుందని అన్నారు. చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ అకునపురం మోహిత్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ బండారి సహకారం అందించారు. సినిమాటోగ్రఫీ విశ్వ తేజ్, ఎడిటింగ్ ఇమాన్యుయేల్ కురియన్ నిర్వహించగా సౌండ్ డిజైన్, మిక్సింగ్ కృష్ణ వంశీ (కిట్టు) పర్యవేక్షణలో జరిగాయి.

ఇక ఈ విజయంపై అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా డైరెక్టర్ అమల అక్కినేని మాట్లాడుతూ.. 'మాయ' ఆచరణ ద్వారా నేర్చుకునే స్ఫూర్తికి ప్రతీక అని వెల్లడించారు. మన విద్యార్థులు సృజనాత్మక పరిమితులను దాటి, ప్రపంచ వేదికలపై గుర్తింపు పొందడం మంచి విషయం అన్నారు. ఈ విజయం వారి క్రమశిక్షణ, జట్టు కృషిని, అర్థవంతమైన కథలను అన్వేషించే స్వేచ్ఛను యువ చిత్రనిర్మాతలకు అందించడం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

graduation-film-by-annapurna-college-wins-annual-national-international-awards

"మాయ" చిత్రం 44వ VGIK ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, మిడ్‌నైట్ మాన్‌స్టర్ క్లబ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్లేమ్ ఫర్స్‌కట్, కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, చెన్నై ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, 5వ ఇండియా ఇంటర్నేషనల్ స్టార్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్, ది కార్నర్ సీట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 వంటి పలు ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలలో అధికారికంగా ఎంపికై, గుర్తింపు పొందింది.

ఈ చిత్రం విజయం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా తన తదుపరి తరం కథకులను.. ప్రోత్సాహించాలనే నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అంటున్నారు. "మాయ" తన ఫెస్టివల్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందున.. బృందం తెరపై మరింత ప్రభావవంతమైన, ప్రామాణికమైన కథలను సృష్టించాలని ఆశిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+