సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగ్గజారాల్సిన అవసరం లేదు

బుల్లితెర స్టార్ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ నటించిన తాజా చిత్రం.. బరాబర్ ప్రేమిస్తా. మేఘనా ముఖర్జీ హీరోయిన్‌. సంపత్ రుద్ర దర్శకత్వం వహించారు. సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. యూత్‌ఫుల్ ఎమోషనల్, రూరల్ డ్రామాగా, తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కాబోతోంది.

ఈ చిత్రానికి ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందించగా, వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫీ, బోంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది యూనిట్. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు జయంత్ సీ పరాన్జీ, నటులు జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బరాబర్ ప్రేమిస్తా అనే టైటిల్ లో ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్, స్వాగ్‌లు ఉన్నాయని జయంత్ సీ పరాన్జీ వ్యాఖ్యానించారు.

JD Chakravarthy Tollywood Actor Sets Social Buzz Ablaze with Candid Thoughts on Telugu Film Campaign

ఈవెంట్‌లో ఓ బూతు పాట పాడటంపై వివాదాస్పదమౌతోంది. జేడీ చక్రవర్తి ఈ వ్యవహారంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. కొత్త కొత్త మార్గాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాల పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయవచ్చని, దీనికోసం అసభ్యతకు దిగడం సరికాదని అన్నారు. ఒక అమ్మాయిని హాఫ్ నేక్డ్ గా లేదా లిప్ లాక్ తో చూపించడం అనేది మంచిది కాదని చెప్పారు. ఇటీవలే అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్నానని, ఇది చూశాక లేచి వెళ్లిపోదామనుకున్నానని అన్నారు.

ఈ వీడియోలో ఎక్కడ కూడా ఆయన బరాబర్ ప్రేమిస్తా అనే పేరును ప్రస్తావించలేదు గానీ.. ఇటీవలే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యాననే హింట్ ఇచ్చారు. నిజానికి అసభ్యత, అశ్లీలానికి అవకాశం లేకుండా ఇన్నోవేటివ్ ఐడియాలతో సినిమా క్యాంపెయిన్ చేయొచ్చని జేడీ చక్రవర్తి చెప్పారు. ఈ క్రమంలో 3 ఈడియట్స్ సినిమా ప్రచారాన్ని గుర్తు చేశారు. అమీర్ ఖాన్ స్వయంగా ఓ ముష్టివాడిగా వేషం వేసుకుని ప్రతి రోజూ సౌరభ్ గంగూలీ ఇంటి వద్ద వెళ్లి ఆయనను గమనించే వాడని పేర్కొన్నారు. గంగూలీ పోలీసులకు కంప్లైంట్ చేస్తే అతను అమీర్ ఖాన్ గా తేలిందని అన్నారు. ఒక సినిమాను జనంలోకి తీసుకెళ్లడానికి ఇలా ఇన్నోవేటివ్ గా ఆలోచనలు చేయవచ్చని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+