ప్రియుడి కోసం రంగంలోకి దిగిన స్టార్ హీరోయిన్.. ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ, 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత సన్నిహితుడి కోసం ఒక గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్నారు. పాయల్ ప్రియుడు సౌరబ్ ధింగ్ర టాలీవుడ్ వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "ఫస్ట్ టైం". ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం పాయల్ రాజ్‌పుత్ గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. సౌరబ్ ధింగ్రను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు, నిర్మాత హేమంత్ ఇప్పనపల్లి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తన ప్రియుడు వెండితెరపై మెరవబోతున్న ఈ శుభ సందర్భంలో పాయల్ రాజ్‌పుత్ స్వయంగా హాజరై ట్రైలర్ విడుదల చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఈ సినిమా ప్రమోషన్లకు కొత్త ఊపునిస్తోంది.

భారత్ లోనే అతిపెద్ద VFX వండర్

"ఫస్ట్ టైం" సినిమా గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బడ్జెట్ పరంగా చిన్నదైనా, విజువల్స్ , టెక్నికాలిటీస్ పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద VFX సినిమాగా రికార్డు సృష్టించబోతోంది. ప్రస్తుత కాలంలో అందరూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వెంట పడుతుంటే, దర్శకుడు హేమంత్ మాత్రం ఎక్కడా AI వాడకుండా కేవలం మానవ మేధస్సుతో హై రేంజ్ గ్రాఫిక్స్‌ను రూపొందించారు. హేమంత్ ఇప్పనపల్లి స్వయంగా కథ, ఎడిటింగ్, VFX లీడ్ బాధ్యతలతో పాటు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.

Payal Rajput to unveil the debut trailer of her boyfriend Saurabh Dhingra for the first time today

భారీ తారాగణం

ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర సరసన అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ రోల్‌లో మెరవబోతున్నారు. వీరితో పాటు మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం , 'ఢీ' పండు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకట్ ,సూరజ్ ఎస్ కురుప్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోయగా, వేణు మురళీధర్ , రామ్ సినిమాటోగ్రఫీ హైలెట్‌గా నిలవనుంది. తమ అభిమాన నటి పాయల్ రాజ్‌పుత్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవుతుండటంతో పాయల్ ఫ్యాన్స్ , సినీ ప్రియుల్లో "ఫస్ట్ టైం" చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంగళవారం విడుదల కాబోతున్న ఈ విజువల్ వండర్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+