ఈ సినిమాపై రూ.4,000 కోట్లు పెట్టా- స్టార్ నిర్మాత: రఫ్ కట్ చూసి..
మచ్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ.. రామాయణ: పార్ట్ 1. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోందీ ఫిల్మ్. నితీష్ తివారీ దర్శకుడు. ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది.. ప్రపంచవ్యాప్తంగా. అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న సినిమాల్లో ఇదీ ఒకటి. బడ్జెట్, నిర్మాణ వ్యయం హాలీవుడ్ రేంజ్ ను మించిపోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఏకంగా 4,000 కోట్ల రూపాయలతో సినిమా రూపుదిద్దుకుంటోంది.
రెండు భాగాలుగా రూపొందుతోంది రామాయణ. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి నటిస్తోన్నారు. లంకాధిపతి రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ మెరుపులు మెరిపించనున్నాడు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస్ నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీనెగ్, యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఇందులో భాగస్వామ్యం అయ్యాయి.

దీని ఫస్ట్ రఫ్ కట్ స్క్రీనింగ్ ముగిసింది. అమెరికా లాస్ ఏంజిలిస్ లోని సినిమార్క్ ప్లయా విస్టాలో ఈ సినిమా రఫ్ కట్ ను ప్రదర్శించారు. ఇది రామాయణం పార్ట్ 1 ప్రీ కట్ వెర్షన్. 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సున్న ప్రేక్షకులు దీనికి హాజరయ్యారు. ప్రత్యేకించి- హాలీవుడ్ స్టూడెంట్ల కోసం ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్, భారీ నిర్మాణం, నటీనటుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
The Ramayana USA Test screening went extremely well 🥳
— The Ramayana 🏹 (@RamayanaSaga) February 24, 2026
Mainly film student were invited and Everyone was extremely positive about the movie especially the story & screenplay. It was the first cut and there was no interval in the film (for this cut) pic.twitter.com/aROxZYPiKy
'ది వీక్' దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, కథనం, చిత్రీకరణపై ప్రేక్షకుల సానుకూల స్పందన లభించిందని తెలిపింది. భారీబడ్జెట్ చిత్రం కావడం వల్ల ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిర్మాతలు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 'ఆదిపురుష్' వంటి ఫెయిల్యూర్స్ ఉన్న నేపథ్యంలో అదే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 4,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు నమిత్ మల్హోత్రా తెలిపారు. గేమ్ ఛేంజర్స్ అనే పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. పార్ట్ 1 షూటింగ్ దాదాపు పూర్తయిందని, సినిమా ప్లాన్ చేసినప్పుడు భారీ విజన్ ఉందని, అందుకే ఖర్చుకు వెనుకాడలేదని తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఎక్కడా అప్పు తీసుకోలేదని, డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ సినిమాను ఓప్రాజెక్ట్ లేదా వ్యాపారంగా చూడట్లేదని తెలిపారు.
-
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ ! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!












Click it and Unblock the Notifications