విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్

యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ఒరిజినల్ హిట్ కొట్టారు. ఇప్పుడు వేసవిలో 'బైకర్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నారు. విమర్శకుల ప్రశంసలు, ఆడియన్స్ రెస్పాన్స్‌తో శర్వానంద్ ఫుల్ జోష్‌లో ఉన్నారని చెప్పొచ్చు. కెరీర్ పరంగా అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఆయన వ్యక్తిగత జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అన్ని ఫొటోలు తీసేశాడు

శర్వానంద్ తన భార్య రక్షిత రెడ్డితో విడిపోతున్నారనే ప్రచారం గతంలో కూడా సాగింది. అయితే తాజాగా చోటుచేసుకున్న ఒక పరిణామం ఆ అనుమానాలను బలపరుస్తోంది. శర్వానంద్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోలను, భార్, కుమార్తెతో దిగిన ఫోటోలను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఆయన ప్రొఫైల్‌లో కేవలం శర్వా వ్యక్తిగత ఫోటోలు, సినిమా ప్రమోషన్లకు సంబంధించిన కంటెంట్ మాత్రమే కనిపిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ భాగస్వామితో విడిపోవాలనుకున్నప్పుడు చేసే మొదటి పని ఇదే కావడంతో, శర్వానంద్ కూడా విడిపోవడానికి సిద్ధమయ్యారని నెటిజన్లు కూడా ఫిక్స్ అయిపోయారు.

Sharwanand Triggers Divorce Buzz After Wiping Wedding Memories from Social Media

ఏడాదిలోనే విభేదాలు

2023లో రక్షిత రెడ్డితో అట్టహాసంగా జరిగిన వివాహ వేడుక చూడముచ్చటగా అనిపించింది. ఏడాది తిరగకముందే మనస్పర్థలు మొదలైనట్లు సమాచారం. గత కొంతకాలంగా రక్షిత రెడ్డి, శర్వానంద్ విడివిడిగా ఉంటున్నారని, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని తెలుస్తోంది. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు శర్వా టీమ్ ఖండించినప్పటికీ, ఇప్పుడు ఫోటోలు డిలీట్ చేయడం చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమవుతోంది. ఒకవైపు 'బైకర్' సక్సెస్ మీట్స్‌లో పాల్గొంటున్న శర్వానంద్, ఈ విడాకుల రూమర్స్‌పై మాత్రం ఎక్కడా స్పందించడం లేదు. ఈ మౌనం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా ఎదిగి, ఎన్నో క్లాసిక్ హిట్లు ఇచ్చిన శర్వానంద్.. తన పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. అయితే సినీ ప్రియులు మాత్రం శర్వా, రక్షిత విడిపోకూడదని, చిరకాలం కలిసుండాలని, వారికి ఒక పాప కూడా ఉందని, ఆ పాప కోసమైనా విభేదాలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+