రౌడీయిజంతో పోరాడుతున్నాం.. కావాలనే అలా అంటూ డైరెక్టర్ ఫైర్ !!
భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దర్శకురాలు "సుధా కొంగర". ఆమె దర్శకత్వ శైలి, కథను చెప్పే విధానం ప్రేక్షకులను కట్టిపడేశాయి. సుధా పుట్టి పెరిగింది విశాఖపట్నంలో కావడం గమనార్హం. సినిమా రంగంపై ఆసక్తితో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వద్ద సుమారు ఏడు సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దర్శకురాలిగా మారారు. ఆమె మొదట్లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, 2016లో వచ్చిన 'ఇరుదు సుట్రు' (తెలుగులో వెంకటేష్‌తో 'గురు') ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద విజయం సాధించింది.
ఇక సూర్య హీరోగా వచ్చిన 'ఆకాశం నీ హద్దు రా' సినిమా సుధా కొంగరను భారతీయ అగ్ర దర్శకుల జాబితాలో నిలబెట్టింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైనప్పటికీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు గానూ ఆమె ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డును అందుకున్నారు. మొత్తంగా ఈ సినిమా 5 జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. రీసెంట్ గానే 'ఆకాశం నీ హద్దు రా' చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్‌తో 'సర్ఫిరా' (Sarfira) గా రీమేక్ చేసి అక్కడ కూడా మంచి మార్కులు కొట్టేశారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయారు.

ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామా "పరాశక్తి". శివకార్తీకేయన్ - స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీలో హీరోలు రవి మోహన్, అథర్వ ముఖ్య పాత్రలు పోషించారు. పృథ్వీ రాజన్, బసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. అలానే జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా.. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంగా తెరకెక్కింది.
అయితే ప్రస్తుతం ఈ మూవీ విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని సుధా కొంగర ఫైర్ అయ్యారు. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ఫేక్ ఐడీలతో నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని మండిపడ్డారు. తమ సినిమాను దెబ్బతీయడానికి నీచమైన పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. మేము ప్రస్తుతం రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
పొంగల్ రేసులో వచ్చి సినిమా బాగున్నా కూడా ఈ తరహా ఇబ్బందులు రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రానికి సెన్సార్ అనుమతి లభించకపోగా.. పరాశక్తి చిత్రానికి మాత్రం చివరి నిమిషంలో లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేసింది.












Click it and Unblock the Notifications