తెలుగు సినీ పరిశ్రమలో శత్రుత్వాలు వీరి మధ్యేనా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అంటే సినిమాల పరంగా, రికార్డుల పరంగా అన్నమాట. అయితే రోజులు గడిచేకొద్దీ ఈ వైరం మితిమీరి వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఆరోగ్యకరమైన పోటీ కాస్తా అనారోగ్యకరంగా మారింది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కారణాలు, రాజకీయ విభేదాలు లేదా కుటుంబాల మధ్య ఉన్న పాత గొడవల వల్ల కొందరు హీరోలు ఒకరినొకరు కలుసుకోవడానికి లేదా మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడటంలేదు. కొన్ని సంవత్సరాల నుంచి కొందరు స్టార్ హీరోలు ఎడముఖం, పెడముఖంగా ఉంటున్నారు.
చిరంజీవి, రాజశేఖర్ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ విడుదల సందర్భంగా వేదికపై జరిగిన గొడవ వీరి మధ్య దూరాన్ని పెంచాయి. సినిమా కథలు కొనుగోలు విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. చిరు అభిమానులు రాజశేఖర్ కారుపై దాడిచేశారు. దానికి చిరు సారీ చెప్పారు. ప్రస్తుతానికి బాగానే ఉంటున్నప్పటికీ గతంలో ఉన్న మనస్ఫూర్తిగా అయితే లేరని చెప్పొచ్చు.

మంచు విష్ణు, మంచు మనోజ్ ఎలా గొడవలు పడ్డారో అందరం చూశాం. ఆస్తి తగాదాలని కొందరు అన్నారు.. అనసవరంగా డబ్బులు తగలేస్తున్నారని మనోజ్ అన్నారు. మోహన్ బాబు విష్ణుకు మద్దతు తెలిపారు. మనోజ్ రెండోపెళ్లి భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డితో జరిగింది. ఈ పెళ్లి కూడా మోహన్ బాబుకు ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వివాదంలో కూడా మనోజ్ విద్యార్థులకు అనుకూలంగా మాట్లాడారు. దీంతో అన్నదమ్ములిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.
చిరంజీవి, మోహన్ బాబు కొన్ని దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. స్నేహం ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరు తరుచుగా వ్యంగ్యపరమైన వ్యాఖ్యలు చేసుకునేవారు. పరిశ్రమలో పెద్దరికం తీసుకునే విషయంలో, పరిశ్రమ 75 సంవత్సరాల వేడుక జరిగే సమయంలో వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. సెలబ్రిటీ, లెజెండ్ పేర్ల విషయంలో కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇంత వైరం ఉన్నా, అకస్మాత్తుగా కలిసి కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.
చిరంజీవి కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబం మధ్య దూరం బాగా పెరిగింది. అల్లు అర్జున్ స్వతంత్రతను కోరుకోవడం, మెగా అనే ముద్ర లేకుండా సొంత బ్రాండ్ ఉండాలనుకోవడంతోపాటు రామ్ చరణ్ తో జరిగిన బయటపడని వివాదం కూడా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరగడానికి కారణమైంది. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కు మద్దతు తెలపకుండా, వైసీపీ తరఫున తన స్నేహితుడి కోసం ప్రచారానికి వెళ్లడం కూడా ఒక కారణం. ఈ వివాదాలన్నీ కలిసి మెగా, అ్లల్లు కుటుంబాల మధ్య దూరం పెంచాయి.
బాలకృష్ణ, నాగార్జునకు కొన్ని సంవత్సరాల నుంచి పడటంలేదు. ఓ వేడుకలో బాలయ్య అక్కినేని, తొక్కినేని అంటూ మాట్లాడారు. ఇది పెద్ద దుమారాన్ని కలిగించింది. ఈ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ తీవ్రంగా స్పందించారు. గతంలో హీరోలంతా పైకి గొడవలు పడుతున్నట్లు కనపడినా, మనస్ఫూర్తిగా కలిసివుండేవారు. కానీ ఇప్పటి హీరోలు మాత్రం పైకి మాములుగా కనపడుతున్నా, లోపల మాత్రం తీవ్ర విభేదాలతో ఉన్నారు.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications