అక్రమ సంబంధాలు.. మొగుళ్లను చితకబాదుతున్న భార్యలు..! దీనిపై మీ కామెంట్ ఏంటి?

హైదరాబాద్ : వివాహ బంధాలకు అర్థం మారుస్తున్నారు కొందరు. దైవసాక్షిగా పెళ్లిళ్లు చేసుకుంటూ అక్రమ సంబంధాలతో వివాహాల పరమార్థం మార్చుతున్నారు. కడదాకా తోడుంటానంటూ పచ్చని పందిరిలో బాసలు చేస్తూ మధ్యలోనే దారి తప్పుతున్నారు. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో ఆనందంగా గడుపుతారని పెద్దలు అనుకుంటుంటే అక్రమ సంబంధాల కారణంగా బంధాల అనుబంధాలను తుంచేస్తున్నారు. ప్రేమ వర్ధిల్లాల్సిన చోట అసూయ, ద్వేషం రాజ్యమేలుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇటీవల హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసిన రెండు ఘటనలు మనుషులు మనసులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కొత్తగూడెంకు చెందిన లక్ష్మణ్‌కు పెళ్లయింది. అయితే భార్యను కాదని మరో వివాహితతో కలిసి వేరే కాపురం పెట్టాడు. ఆమె కూడా భర్తను వదిలేసి ఇతగాడితో జీవిస్తోంది. అది కాస్తా మొదటి భార్యకు తెలిసి వారు నివసిస్తున్న ఇంటిపై దాడి చేశారు. కెమెరాల సాక్షిగా ఆమె భర్తను, అతడితో కలిసి ఉంటున్న మరో మహిళను చితకబాదారు.

write your comment on illegal marriage affairs

ఇలాంటి ఘటనే చింతల్‌లో మరొకటి వెలుగుచూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారెపాకకు చెందిన లావణ్యకు.. కృష్ణ జిల్లా నరసరావు పాలెంకు చెందిన సుధాకర్‌తో 2015లో పెళ్లైంది. పెళ్లి సమయంలోనే అతనికి 40 లక్షల కట్నం ఇచ్చారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. అయితే చిన్నారి అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని చింతల్‌లో కాపురం పెట్టాడు. విషయం తెలిసిన మొదటి భార్య వారు కాపురముంటున్న ఇంటికొచ్చి దుమ్ము దులిపింది.

ఇలాంటి ఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తుండటం వివాహ బంధానికి మాయని మచ్చలా మారుతోంది. అక్రమ సంబంధాలకు చెక్ పెట్టాలంటే కేసులు పెట్టాలా లేదంటే ఇతర మార్గాలు ఏమైనా అమలు చేయాలా.. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అభిప్రాయం రాయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+