తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణలో త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హాల్ టికెట్లు ఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పదో తరగతి రెగ్యూలర్/ప్రైవేటు/ఓఎస్ఎస్/ఒకేషనల్ విద్యార్థులు తమ హాల్ టికెట్లు పొందేందుకు జిల్లా పేరు, స్కూల్ పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

మండిపోతున్న ఎండలు: తెలంగాణలో 15 నుంచి ఒంటిపూట బడులు
వేసవి సెలవుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు పాఠశాలలు కొనసాగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది. పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూల్ ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యాసంవత్సరం ముగిసే వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వల్లో స్పష్టం చేశారు. 12.30 గంటలకే మధ్యాహ్న భోజనం పెట్టాలని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.












Click it and Unblock the Notifications