పదో తరగతి అర్హతతో 39,481 కానిస్టేబుల్ కొలువులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..
నిరుద్యోగులకు శుభవార్త... పదోతరగతి అర్హతతో కేంద్ర సాయుధ దళాల్లో 39,481 కానిస్టేబుల్ కొలువులకు ఎస్ఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ పరీక్ష ఆంగ్లం, హిందీతో పాటు తెలుగులోనూ రాసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) సుమారు ప్రతి ఏటా సాయుధ దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తోంది. ఇక, ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్హతతో 39,481 కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. జనరల్ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పోటీ పడే అవకాశం ఉంది. మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ యూనిఫాం ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్, ఫిజికల్, మెడికల్ టెస్టులతో ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ప్రారంభం నుంచే ఈ పోస్టులకు నెలకు సుమారు రూ.40,000 వేతనం ఉంటుంది.

పోస్టుల ఖాళీలు..
మొత్తం పోస్టులు 39,481
బీఎస్‌ఎఫ్-15,654,
సీఐఎస్‌ఎఫ్-7145,
సీఆర్‌పీఎఫ్-11,541,
ఎస్‌ఎస్‌బీ-819,
ఐటీబీపీ-3017,
ఏఆర్-1248,
ఎస్‌ఎస్‌ఎఫ్-35,
ఎన్‌సీబీ-22
ఈ మొత్తం పోస్టుల్లో 3869 పోస్టులు మహిళలకు కేటాయించారు.
అర్హతలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జనవరి 1, 2025 నాటికి 18- నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు వివరాలు..
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 14వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలు జనవరి - ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇతర పూర్తి సమాచారం కోసం ఎస్ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌ను www.ssc.gov.in సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications