అదానీ సంస్థ విన్నూత్న డిప్లమో "కర్మ శిక్ష"- చదువుతో పాటే డబ్బూ, ఉద్యోగం..!
అదానీ సంస్థ చేపడుతున్న కర్మశిక్ష కార్యక్రమం ఓ వర్క్-స్టడీ డిప్లొమా ప్రోగ్రామ్. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు ఇది నైపుణ్యాలను అందించబోతోంది.
మన దేశంలో ఓవైపు సంస్థలు, మరోవైపు ఉద్యోగార్ధులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సమన్వయం. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉద్యోగార్దులు ఉండటం లేదని ఒకరు చెప్తుంటే, ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చేయాలో సంస్థలు చెప్పడం లేదని మరొకరు ఆరోపిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో సమస్యను తీర్చేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ స్కిల్స్-ఎడ్యుకేషన్ సంస్థ 'కర్మ శిక్ష' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అదానీ సంస్థ చేపడుతున్న కర్మశిక్ష కార్యక్రమం ఓ వర్క్-స్టడీ డిప్లొమా ప్రోగ్రామ్. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు ఇది నైపుణ్యాలను అందించబోతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతో పాటు ఆర్థిక స్వయం సమృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యాలు. అదానీ గ్రూప్ యొక్క నైపుణ్య అభివృద్ధి విభాగమైన అదానీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ , నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ , మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో ఈ 'కర్మ శిక్ష' వర్క్-స్టడీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇవాళ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమం 10వ, 12వ తరగతి పాసైన విద్యార్థులకు, అలాగే దేశ నలుమూలల నుండి ఐటీఐ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమ-సమగ్ర, ఉద్యోగ-సిద్ధ విద్యను అందించడానికి రూపొందించారు. ఇది అదానీ పోర్ట్స్, పవర్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ వంటి ప్రధాన రంగాలలో క్లాస్‌రూమ్ అభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమ అనుభవంతో కలిపి ఉంటుంది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కర్మ శిక్ష ద్వారా, తాము విద్యతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను అందించి, అవకాశాలకు మార్గాలను తెరుస్తున్నామని తెలిపారు. ఈ చొరవ మా 'హమ్ కర్కే దిఖాతే హై' (మేం చేసి చూపిస్తాం) తత్వానికి నిదర్శనం అన్నారరు. సంకల్పాన్ని ఆచరణలోకి, ఆశయాన్ని వాస్తవంలోకి మార్చడమన్నారు.
ఇది కొత్త తరాన్ని వికసిత్ భారత్ నిర్మాణానికి అర్థవంతంగా దోహదపడేలా శక్తివంతం చేస్తుందని అదానీ తెలిపారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక, పోర్ట్స్ మేనేజ్‌మెంట్ , లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల వర్క్-స్టడీ డిప్లొమాను అందిస్తుందని ఆయన వెల్లడించారు. ఎన్సీవీఈటీ గుర్తింపు పొందిన ఈ సర్టిఫికెట్ .. అదానీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్‌తో కలిసి ఉంటుంది. దీనివల్ల పరిశ్రమ, సమగ్ర అభ్యాసం ద్వారా బహుళ రంగాల అనుభవం లభిస్తుంది.
విద్యార్థులకు ప్రోగ్రామ్ సమయంలో సహాయపడటానికి ఆకర్షణీయమైన స్టైఫండ్, డిగ్రీ ప్రోగ్రామ్‌లలో లేటరల్ ఎంట్రీతో సహా ఉన్నత విద్య మార్గాలు అందుబాటులో ఉంటాయి. కర్మ శిక్షతో, విద్యార్థులు 'సంపాదిస్తూ నేర్చుకునే' నమూనాతో ప్రయోజనం పొందుతారు. ఇది నిరుద్యోగులకు చదువుతూనే ఆర్థిక స్వయం సమృద్ధిని కల్పిస్తుంది. ఈ డిప్లొమా జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను, ఉన్నత విద్యను అందిస్తుంది.

అదానీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ సీఈఓ రాబిన్ భౌమిక్ మాట్లాడుతూ.. కర్మ శిక్ష కేవలం ఒక డిప్లొమా కాదని, ఇది అవకాశాలకు ఒక మార్గమని తెలిపారు. స్కిల్2ఎంప్లాయ్ తమ మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌గా ఉండటంతో, ప్రతి నైపుణ్యం ఉద్యోగానికి దారితీస్తుందని, ప్రతి అభ్యాసకుడు భారతదేశ వృద్ధి కథనానికి దోహదపడతాడని స్పష్టం చేశారు. అకాడమిక్స్‌ను ఆఫీస్ ప్రాక్టీస్ తో లింక్ చేయడం ద్వారా, భవిష్యత్-సిద్ధ భారతదేశం కోసం పరిశ్రమ-సిద్ధ నిపుణుల బలమైన పైప్‌లైన్‌ను తాము సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీవీఈటీతో కలిసి పరిశ్రమలతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా, ఏఎస్ఐ నైపుణ్య-ఆధారిత, ఉద్యోగ-సమగ్ర విద్య యొక్క స్కేలబుల్ నమూనాను సృష్టిస్తోందన్నారు.
.












Click it and Unblock the Notifications