డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సిలింగ్‌పై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన..
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఖరారు చేస్తామని ప్రకటించిన విద్యాశాఖ అభ్యర్థులకు షాకిచ్చింది. డీఎస్సీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నామని, తదుపరి కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
ఇటీవలే, తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లకు ఈ నెల (అక్టోబర్) 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు. దీంతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ అనంతరం ఉద్యోగాల్లో చేరిపోవచ్చని అనుకున్నారు. కానీ, అంతలోనే విద్యాశాఖ వారికి ఓ షాకింగ్ న్యూస్ అందించింది.

కానీ, నేడు జరగాల్సిన కౌన్సెలింగ్‌ను చివరి క్షణంలో విద్యాశాఖ వాయిదా వేసింది. దీంతో డీఎస్సీ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు చెబుతున్నారు. డాటా రానందున డీఎస్సీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. రేపు (అక్టోబర్ 16) డీఎస్సీ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications