గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం..
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్... ఏపీలోని గ్రూప్ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్‌ను అందిచింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ దరఖాస్తుల్లో పలు మార్పులకు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ కమిషన్ అవకాశం కల్పించింది. పరీక్ష కేంద్రాలు, పోస్టులు, జోన్ల ప్రాధాన్యత మార్చుకునేందుకు జూన్ 25 తేదివరకు అవకాశం కల్పించింది.
గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ కమీషన్ తెలిపింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గ్రూప్ 2 మెయిన్స్ కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను కూడా ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది. ఇప్పుడు తాజాగా అభ్యర్థులకు మరో కీలక అప్‌డేట్‌ను అందించింది.

జూలై 28న మెయిన్స్ పరీక్షలు..
గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు ఈ నెల 25వ తేది రాత్రి 11.59 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న వినతుల మేరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని అధికారులు వెల్లడించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వచ్చే నెల 28న నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొ పేపర్ 150 మార్కులు ఉంటుంది. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.












Click it and Unblock the Notifications