నేటి నీట్ యూజీ పరీక్షకు సర్వం సిద్ధం..!
నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల మధ్య పరీక్ష జరగనుంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్షకు మొత్తం 24 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 70వేల మంది ఉండగా, తెలంగాణ నుంచి 80 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దేశంలోని 557 నగరాలు, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు.
నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలెటికల్ టూల్‌ను ఉపయోగించనున్నారు. పరీక్షలో అభ్యర్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే ఇది వెంటనే గుర్తిస్తుంది. పరీక్ష రాసే అభ్యర్థులు తప్పకుండా తమతో పాటు వీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. హల్ టికెట్ తో పాటుగా ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూప్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అస్సలు వెంట తీసుకెళ్లొద్దు. ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి అస్సలు ధరించకూడదు.

వీటిని పాటించాల్సిందే..!
ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషలలో ఉంటుంది. ఈ పరీక్ష పెన్, పేపర్ విధానంలో నిర్వహించబడుతుంది. విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రీస్కింగ్ నిర్వహిస్తారు. షూస్ తో పాటు విద్యార్థులు ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు. మెహేంది, గోరింటాకు వంటివి పెట్టుకోని రాకూడదు. అభ్యర్థులు సంప్రదాయ దుస్తులు వేసుకొని రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఎన్టీఏ సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి గదిలో నిఘా నేత్రాల నడుమ పరీక్ష నిర్వహణ ఉంటుంది.












Click it and Unblock the Notifications