ఏపీ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల: ఇలా చెక్ చేసుకోండి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆన్‌లైన్‌లో బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి గత సంవత్సరం నవంబర్ నెలలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఫిబ్రవరి 19న జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 28న ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. కాగా, 57,923 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు. వారందరికీ దేహదారుఢ్య పరీక్ష పీఎంటీ/పీఈటీకి హాల్ టికెట్లు జారీ అయ్యాయి.

అయితే, దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అయిన 31,193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్షకు హాల్ టికెట్లు ఇచ్చారు. తుది రాత పరీక్ష నాలుగు పేపర్లకు నిర్వహించిన అధికారులు నేడు ఫలితాలు వెలువరించారు.
ఏపీ ఎస్ఐ తుది రాత పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ సెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ - 2023 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు టీఎస్ సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ మురళీకృష్ణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన రోజు తేదీలను ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందవచ్చని తెలిపారు. అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను త్వరలోనే తమ వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications