రాత‌ప‌రీక్ష లేకుండానే రైల్వేలో మ‌రో జాబ్ నోటిఫికేష‌న్‌.. అర్హులు వీరే..!

ఎటువంటి రాత‌ప‌రీక్ష లేకుండానే రైల్వేలో మ‌రో జాబ్ నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా లెవల్ 1 నుండి 5 వరకు వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం ఆర్ఆర్‌సి డ‌బ్య్లూఆర్‌ స్పోర్ట్స్ కోటా అధికారిక నోటీసును జారీ చేసింది. మొత్తం 64 పోస్ట్‌ల‌కు ఈ నోటిఫికేష‌న్ వెలువ‌డింది. రిక్రూట్మెంట్ జరగనుంది. 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ 'సి'/ గ్రూప్ 'డి' ఖాళీల భర్తీకి ఆర్ఆర్‌సి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవ‌చ్చు.అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు అప్ల‌య్ చేసుకోగ‌ల‌రు. ఈ నెల 16నుంచే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. సెప్టెంబర్ 14 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు : 64
లెవెల్‌-4/5: 5 పోస్టులు
లెవెల్‌-2/3: 16 పోస్టులు
లెవెల్‌-1: 43 పోస్టులు

Another job notification in railways without written exam these are the eligible ones

విద్యార్హ‌త : లెవెల్‌-4/5 పోస్టులకు ఏదైనా డిగ్రీ చ‌దివి ఉన్న‌వారు అర్హులు. లెవెల్‌-2/3 పోస్టులకు ఐటీఐ, పన్నెండో తరగతి చ‌దివి ఉండాలి. లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత క‌లిగి ఉండాలి. వీటితోపాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉన్న‌వారు అర్హులు.

క్రీడలు : బుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేసైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.

ద‌ర‌ఖాస్తు రుసుము..

ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే జ‌నరల్, OBC, EWS అభ్యర్థులు రూ. 500 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, ESM, PWD, EBC, మైనారిటీ, మహిళా అభ్యర్థులు మాత్రం 250/- రూపాయ‌లు చెల్లించాలి.

వ‌య‌సు : 18 నుంచి 25 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో ఉండాలి.

ఎంపిక విధానం..

ముందుగా స్పోర్ట్స్ ట్రయల్స్ ఉంటుంది. ఆ త‌ర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వైద్య పరీక్షకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+