AP EAPCET 2024(EAMCET) Notification: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తులు ఇలా..!
ఏపీలోని ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ జేఎన్టీయూ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ జేఎన్టీయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను అందబాటులో ఉంచారు. అభ్యర్ధులు సంప్రదించడానికి మెయిల్ ను అందుబాటులో ఉంచారు.
రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్(ఎంసెట్) పరీక్ష నోటిఫికేషన్ ప్రకారం నిన్నటి నుంచే ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 15 వరకూ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే రూ.500 ఫైన్ తో ఏప్రిల్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వెయ్యి రూపాయల ఫైన్ తో మే 5 వరకూ, 5 వేల ఫైన్ తో మే10 వరకూ, 10 వేల రూపాయల ఫైన్ తో మే 12 వరకూ అప్లికేషన్లు తీసుకుంటారు.

అలాగే ఆన్ లైన్ లో చేసిన దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు మే 4 నుంచి 6వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 47 కేంద్రాలతో పాటు హైదరాబాద్ లోని సికింద్రాబాద్, ఎల్బీనగర్ లోని పరీక్షా కేంద్రాల్లోనూ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం మే 13 నుంచి 16 వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17 నుంచి 19 వరకూ అవకాశం కల్పిస్తారు.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ రెండు సెషన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్ధులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధులకు ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు [email protected]కు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. అలాగే 0884-2359599, 2342499 నంబర్లకు కూడా ఫోన్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications